ఆరోగ్యం విషయంలో సూపర్ ఫుడ్ అంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, నెయ్యి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇన్నాళ్లూ సూపర్ ఫుడ్ అంటే ఇవే అనుకునేవాళ్లం. పాలల్లో ఆవు, మేక, గేదె పాలు ఉండేవి. ఇప్పుడు బొద్దింక పాలు కూడా ఆ జాబితాలో చేరాయి.