బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలంటే ఈ అలవాట్లను వదిలిపెట్టకతప్పదు.. !

First Published Jul 5, 2022, 2:08 PM IST

కొన్ని రకాల అలవాట్లు మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే అలాంటి వాటిని తొందరగా వదిలేయాలి. లేదంటే మీరు చేస్తున్న పనిపట్ల ఏకాగ్రత్త తగ్గడంతో పాటుగా మెమోరీ పవర్ కూడా తగ్గుతుంది. 
 

brain active tips

శరీరంలో ఉన్న ప్రతి అవయవం కీలకమైందే. దేన్ని నిర్లక్ష్యం చేసినా.. ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ప్రతి అవయవాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన శరీరంలో ఉండే ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. దీన్ని ఆరోగ్యం బాగుంటేనే.. మీ రోజు వారి పనులను సక్రమంగా చేసుకోగలుతారు. అయితే మీకున్న కొన్ని అఅవాట్లు మీ మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. దీంతో విషయాలను గుర్తించుకోలేకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆ అలవాట్లను వదులుకుంటేనే మీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

smoking

మద్యపానం, ధూమపానం

ధూమపానం, మద్యపానం ఈ రెండు మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ముఖ్యంగా ఈ చెడు అలవాట్ల వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. స్మోకింగ్ కారణంగా మెదడు కణాలు దెబ్బతింటాయి. స్మోకింగ్ చేసే వారిలో మెమోరీ పవర్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మత్తుపదార్థాలు, సిగరేట్లు మన శరీరాన్నే కాదు బ్రెయిన్ ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయి. అందుకే ఈ రెండు అలవాట్లను దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఒత్తిడి

ఈ రోజుల్లో చాలా మంది తినడానికి కూడా టైం లేనంత బిజీ షెడ్యూల్ తో జీవిస్తున్నారు. ఇలాంటి వారే ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి శరీరానికే కాదు.. మెడదు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఒత్తిడి వల్ల మెమోరీ పవర్ బలహీనపడుతుంది. అందుకే ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. ఈ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడేందుకు యోగా, ధ్యానం వంటి చేయాలి. 

breakfast

బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోకపోవడం

బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఎంతో మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేయకుండానే పనుల్లోకి వెళుతుున్నారు. ఇది శరీరాన్ని బలహీనపర్చడమే కాదు మెదడు పనితీరుపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తేనే మీరు ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు. ముఖ్యంగా ఉదయం పూట పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. 
 

నిద్రలేమి

ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య కామన్ గా మారిపోయింది. ఈ మహమ్మారి బారిన ఎంతో మంది పడుతున్నారు. ఉద్యోగం, బిజీ లైఫ్ స్టైల్, గంటల తరబడి ఫోన్లకు అత్తుక్కుపోవడం తెల్లవార్లూ మేల్కొనే ఉండటం వంటి ఎన్నో కారణాల వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారు. దీంతో అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. రోజుకు  7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోతేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

click me!