బంగాళాదుంప (Potato): కూరగాయల్లో రారాజుగా బంగాళాదుంపలను పిలుస్తారు. ఎందుకంటే ఈ బంగాళాదుంపలను ఎన్నో రకాల కూరగాయలతో కలిపి వండుతారు. దీన్ని ఏ కూరగాయలతో కలిపి చేసినా.. టేస్ట్ అదిరిపోతుంది. కానీ ఇది డయాబెటీస్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్లు (Carbohydrates), పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచడానికి సహాయపడతాయి. అందుకే బంగాళా దుంపలతో చేసిన చిప్స్, బంగాళా దుంప టిక్కి, ఫ్రెంచ్ ఫ్రైట్ వంటివి ఏవీ తినకూడదు.