Chanakya Niti: కోటి రూపాయలు ఇచ్చినా.. వీరి ఇంట్లో భోజనం చేయకూడదు..!

Published : Jul 02, 2026, 05:39 PM IST

 Chanakya Niti: ఎదురు డబ్బులు ఇచ్చినా కూడా చాణక్యుని ప్రకారం..ఐదుగురు ఇళ్ల ల్లో భోజనం చేయకూడదట. ఎందుకు చేయకూడదు? ఆ ఐదుగురు ఎవరు..? వారి ఇంట్లో భోజనం చేస్తే ఏం జరుగుతుంది? చాణక్య నీతిలో ఏం చెప్పారు? 

PREV
14
చాణక్యుడు ఏం చెబుతున్నాడు..

అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. ఎవరైనా పిలిచి భోజనం పెడతామన్నా, అన్నదానం చేసినా.. కళ్లకు అద్దుకొని మరీ తీసుకుంటాం. అంతెందుకు.. ఈ భూమి మీద అన్ని దానాలలో కెల్లా గొప్ప దానంగా అన్నదానాన్ని చెబుతారు. అలాంటి అన్నదానం ఐదుగురు దగ్గర నుంచి మాత్రం తీసుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. చాణక్య నీతి ప్రకారం.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఐదుగురు ఇళ్ల ల్లో భోజనం చేయకూడదు. ఎందుకు..? ఆ ఐదుగురు ఎవరు? వారి ఇంట్లో ఎందుకు భోజనం చేయకూడదు..? చాణక్యుడు ఎందుకు అలా చెప్పాడో ఇప్పుడు చూద్దాం...

24
నిజాయితీలేని ఇల్లు..

నిజాయితీ లేని వ్యక్తులతో నిండి ఉన్న ఇంట్లో భోజనం చేయకూడదు. నిత్యం మోసాలు, అక్రమాలు, అన్యాయాలతో డబ్బు సంపాదించేవారి ఇంట్లో పొరపాటున కూడా ఆహారం తీసుకోకూడదు.ఎంత ఆకలితో అలమటిస్తున్నా కూడా.. ఇలాంటి ఇంటి భోజనం చేయడం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు. ఇలాంటివారి చేతి నుంచి భోజనం అందుకుంటే.. వారి పాపంలో మనం కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది.

34
నిత్యం కోపంతో, దుర్భాషలు ఆడేవారి ఇల్లు..

మనుషులకు కోపం ఉండటం సహజం. కానీ.. సమయం, సందర్భం లేకుండా.. అందరిపై కోపం చూపిస్తూ.. నోటికి వచ్చినట్లు దుర్భాషలాడే వ్యక్తి ఇంట్లో భోజనం చేయడం కూడా మంచిది కాదు అని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే.. వీరు భోజనం పేరుతో ఎక్కువగా ఇతరులను అవమానిస్తూ ఉంటారు. ఇలాంటి వారి ఇంట్లో చేసిన భోజనం మన ఒంటికి కూడా సహించదు.

44
నాస్తికుని ఇల్లు..

చాణక్యుని ప్రకారం దేవుడిని నమ్మని, పూజించని ఇంట్లో కూడా భోజనం చేయకూడదు. వేదాలను అవమానించేవారు.. ధర్మాన్ని పాటించని వారి ఇంట్లో భోజనం చేయడం నెగిటివిటీని పెంచుతుంది.

అతిథులను గౌరవించని ఇంట్లో...

భారత దేశ సంప్రదాయంలో.. అతిథి దేవో భవ అని చెబుతారు. అంటే.. ఇంటికి వచ్చిన అతిథి దైవంతో సమానంగా చూడాలి. అలా కాకుండా.. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించకుండా, అవమానకరంగా మాట్లాడే వారి ఇంట్లో భోజనం చేయడం మంచిది కాదు. అలాంటి వారుు మిమ్మల్ని భోజనానికి స్వాగతించినా కూడా మీరు వెళ్లకూడదు.

వడ్డీ వ్యాపారి ఇల్లు..

వడ్డీల పేరుతో.. ప్రజలను పీడించే వారి ఇంట్లో భోజనం చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే.. ఇది అనైతిక మార్గంలో సంపాదించిన డబ్బు. అలాంటి పాపపు సొమ్ముతో చేసిన భోజనం చేయడం వల్ల ఆ పాపంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు.

Read more Photos on
click me!

Recommended Stories