Chanakya Niti: అమ్మాయిలకు ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలు నచ్చుతారో తెలుసా?

Published : Jun 17, 2026, 06:11 PM IST

 Chanakya Niti: కేవలం ఆస్తి, అందం ఉన్న అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలకు నచ్చుతారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ చాణక్యుడి ప్రకారం, ఎలాంటి గుణాలు ఉండే అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతారో తెలుసా? 

PREV
14
చాణక్య నీతి ఏం చెబుతోంది...

నీతిశాస్త్ర కోవిదుడు చాణక్యుడు అందరికీ పరిచయమే. ఆయన సూక్తులను ఇప్పటికీ అనుసరించేవారు ఉన్నారు. చాణక్య నీతి ని ఫాలో అయితే.. జీవితంలో విజయం, సంపద, వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావు. చాణక్యుడి ప్రకారం.. ఒక స్త్రీ.. పురుషుల్లో ఏం చూస్తుంది..? ఏ లక్షణాలు చూసి ఇష్టపడుతుంది? కేవలం అందం, డబ్బు ఉంటే సరిపోతాయా..? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

24
చెప్పింది వినడం..

అమ్మాయిలు అబ్బాయిల్లో అందం కన్నా సహనం ఎక్కువ చూస్తారు. ముఖ్యంగా తాము చెప్పింది వింటున్నారా లేదా అనే విషయంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తాము చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని అనుకుంటారు. తమ మాటలను వినకుండా నిర్లక్ష్యం చేసే అబ్బాయిలు మహిళలకు అస్సలు నచ్చరు.

34
నిజాయితీ..

ప్రతి అబ్బాయిలో అమ్మాయిలు ముందుగా చూసేది నిజాయితీ. మరీ ముఖ్యంగా మా జీవితంలోకి వచ్చే అబ్బాయి చాలా నిజాయితీగా ఉండాలి అని కోరుకుంటారు. నిజాయితీగా ఉండే వారు తమను ఎప్పటికీ మోసం చేయరని.. తమను జీవితాంతం సంతోషంగా చూసుకుంటారని నమ్ముతారు. అలాంటి వ్యక్తినే కోరుకుంటారు. అంతేకాదు.. తమతో చాలా మర్యాదగా ఉండాలని.. నలుగురు ముందు అవమానించకూడదని కోరుకుంటారు.

44
హాస్యం..

అబ్బాయిల్లో ఉండే కామెడీ సెన్స్ ని అమ్మాయిలు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఎప్పుడూ నవ్వుతూ.. చుట్టూ ఉన్నవారందరినీ నవ్విస్తూ ఉండేవారి పట్ల అమ్మాయిలు చాలా తొందరగా ఆకర్షితులు అవుతారు. సెన్సాఫ్ హ్యూమర్ ఉండే అబ్బాయిలతో ఉంటే.. జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉంటామని నమ్ముతారు.

Read more Photos on
click me!

Recommended Stories