ఎసెన్షియల్ ఆయిల్స్... సరిగానే వాడుతున్నారా?

First Published Jul 30, 2021, 1:46 PM IST

ఎసెన్షియల్ ఆయిల్స్ సహజసిద్ధమైనవి. చెట్లనుంచి తయారవుతాయి. వీటిని డిస్టిల్ చేయడం ద్వారా వాటిలోని సహజగుణాలు పోకుండా ఉంటాయి. వీటిని ప్రభావిత ప్రాంతాల్లో వాడడం వల్ల వీటిలోని క్రియాశీల పోషకాలు ఇంద్రియ గ్రంధుల ద్వారా మెదడును ప్రేరేపిస్తాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 

నేటి రోజుల్లో దేని గురించైనా సమాచారం ఈజీగా దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువగా కూడాలభిస్తుంది. అందుకే ఏది కొన్నాలన్నా.. ఏది వాడాలన్నా ముందుగా గూగుల్ చేయడం అలవాటుగా మారిపోయింది.
undefined
ఆహారపదార్థాల నుంచి హెల్త్ టిప్స్ వరకు ప్రతీదాన్నీ పూర్తిగా తెలుసుకున్న తరువాత కొనడమో, వాడడమో చేస్తున్నారు. ఇక ఎసెన్సియల్ ఆయిల్స్, వాటి ఉపయోగాల గురించి అయితే ఎన్నో అనుమానాలు ఉంటాయి. వాటన్నింటినీ తెలుసుకుని సరిగా వాడితే అందులోని ప్రయోజనాలను కరెక్టుగా పొందచ్చు.

mint

ఎసెన్షియల్ ఆయిల్స్ సహజసిద్ధమైనవి. చెట్లనుంచి తయారవుతాయి. వీటిని డిస్టిల్ చేయడం ద్వారా వాటిలోని సహజగుణాలు పోకుండా ఉంటాయి. వీటిని ప్రభావిత ప్రాంతాల్లో వాడడం వల్ల వీటిలోని క్రియాశీల పోషకాలు ఇంద్రియ గ్రంధుల ద్వారా మెదడును ప్రేరేపిస్తాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
undefined
అయితే ఇవి వాడేముందు వీటిగురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఈ నూనెలు అనేక మంచి లక్షణాలతో కూడి.. ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటి తయారీలో వాడే ప్రతీ పదార్థం దాని ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అందుకే ఇవి విడిగా ఒక్కటిగా వాడినా వేరే వాటితో కలిపి మిశ్రమంగా వాడినా తక్షణ ఫలితాలను అందిస్తుంది.
undefined
టీ ట్రీ ఆయిల్ బలమైన క్రిమినాశక లక్షణాలతో ఉండే నాచురల్ సహజ శానిటైజర్. లావెండర్ ఆయిల్ చక్కటి పరిమళంతో నరాలను బుజ్జగించి.. మంచి నిద్రకు దారితీస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ గొంతు, ఛాతీ సమస్యలు, దగ్గులకు ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది.
undefined
ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ను పీల్చడం ద్వారా లేదా చర్మంపై రాయడం ద్వారా వాటి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే వాడే ముందు రియాక్షన్ లేదని తెలుసుకోవడానికి కొద్దిగా చర్మంమీద రాసుకుని చూడాలి. ఎలాంటి రియాక్షన్ లేకపోతే వాడుకోవచ్చు.
undefined
ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేసే మొక్కలు మనదేశంలో బాగానే పండుతుండడం వల్ల వీటిలో అనేక భారతీయ బ్రాండ్లు వచ్చాయి. అందుకే అనేక రకాల బ్రాండ్ల ఎసెన్షియల్ ఆయిల్స్ దేశంలో అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రామాణికత కోసం EOBBD (ఎసెన్షియల్ ఆయిల్ బొటానికల్ అండ్ బయోకెమికల్ డిఫైన్డ్) చూడాలి.

నూనెలు కొనేప్పుడు లేదా వాడేప్పుడు దీనికోసం తప్పనిసరిగా తనిఖీ చేయాలి. మంచివి కదా అని ఎసెన్షియల్ ఆయిల్స్ ను ఎక్కువగా వాడొద్దు. అలా వాడితే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది.
undefined
click me!