Soap Hacks: సబ్బు వాడాక చివరికి చిన్న ముక్కగా అయిపోతుంది. అప్పుడు వాటిని పడేస్తూ ఉంటాము. కానీ అలాంటి సబ్బు ముక్కలను ఒక చోట దాచి వాటన్నింటినీ ఇంట్లో అనేక రకాలుగా వాడుకోవచ్చు.
సబ్బు వాడాక చివరలో చిన్న ముక్కలుగా మారి మిగిలిపోవడం సహజం. అలాంటి వాటిని ఎంతో మంది పారేస్తూ ఉంటారు. ఇలాంటి సబ్బు ముక్కలను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. వీటితో ఇంటిని మెరిపించవచ్చు. సబ్బు ముక్కలను ఒక డబ్బాలో వేసి దాచి ఉంచండి. వాటిని అవసరం అయినప్పుడల్లా వాడవచ్చు. ఎలా వాడాలో తెలుసుకోండి.
25
దుస్తుల కోసం
వర్షాకాలం, చలికాలంలో బీరువాలోని పెట్టిన దుస్తుల నుంచి ఒక రకమైన ముక్కి వాసన వస్తుంది. గాలి, వేడి లేకపోవడం వల్ల కలిగే వాసన అది. మార్కెట్లో దొరికే స్ప్రేలు వాడడం కన్నా మిగిలిపోయిన సబ్బు ముక్కలను ఆ వాసన పొగొట్టేందుకు వాడొచ్చు. ఓ మస్లిన్ క్లాత్‌లో పొడి సబ్బు ముక్కను చుట్టి వార్డ్‌రోబ్‌లో లేదా షూ ర్యాక్‌లో పెట్టండి. తేమ వాసన మాయమవుతుంది.
35
చాక్ పీస్ బదులు సబ్బు
కుట్లు, అల్లికలు అలవాటు ఉన్నవాళ్లు సైజు కోసం గీతలు గీసేందుకు చాక్ పీస్ వాడతారు. వాటికి బదులు ఎండిపోయినా సబ్బు ముక్కను వాడొచ్చు. టైలర్లకు చాక్ పీస్ కన్నా సబ్బు ముక్కే ఉత్తమం. చాక్ పీస్ మరకలు త్వరగా వదలవు… కానీ సబ్బు గీతలు త్వరగా వదులుతాయి.
మిగిలిపోయిన సబ్బు ముక్కలు అన్నింటినీ ఒక బాటిల్ వేసి ఉంచండి. వాటిని మొక్కలకు కీటకనాశినిగా వాడొచ్చు. ఆ బాటిల్ లో నీటిని వేసి సబ్బు ముక్కలు కరగనివ్వాలి. ఆ నీటిని మొక్కలపై స్ప్రే చేయాలి. ఇది మంచి పెస్టిసైడ్‌గా పనిచేస్తుంది. కానీ సబ్బును తక్కువ మోతాదులోనే చల్లాలి. లేకుంటే మొక్కలకు ప్రమాదం.
కొన్నిసార్లు ఇంటి తలుపులు, కిటికీల నుంచి కీచుమని శబ్దం వస్తుంటుంది. ఈ శబ్దాన్ని ఆపేందుకు తలుపు లేదా కిటికీ అంచులను ఈ సబ్బు ముక్కతో రుద్దండి. ఆ శబ్దం రావడం ఆగిపోతుంది.
55
బ్యాగ్ జిప్‌కు సబ్బు ముక్క
పాత జాకెట్లు, బ్యాగులు లేదా జీన్స్ ప్యాంట్ల జిప్‌లు సరిగ్గా పనిచేయనప్పుడు సబ్బు ముక్కను వాడవచ్చు. జిప్ పైన సబ్బు ముక్కతో నెమ్మదిగా రుద్దాలి. ఆ తర్వాత జిప్‌ను పైకి, కిందికి లాగాలి. ఇరుక్కుపోయిన జిప్ వెంటనే ఫ్రీ అవుతుంది. సబ్బు అద్భుతమైన లూబ్రికెంట్‌లా పనిచేస్తుంది.
షూస్, సాక్సుల నుంచి దుర్వాసన వస్తున్నా కూడా సబ్బు ముక్కలను వాడవచ్చు. రాత్రిపూట షూ లేదా సాక్సుల లోపల ఒక సబ్బు ముక్కను ఉంచండి. ఉదయాన్నే దాన్ని తీసేయండి. సాక్సుల నుంచి వచ్చే పాడు వాసన చాలా వరకు తగ్గుతుంది.
మిగిలిపోయిన సబ్బు ముక్కలను మీరు బాత్రూమ్ ఫ్రెష్‌నర్‌గా వాడుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో లేదా నెట్ బ్యాగ్‌లో సబ్బు ముక్కను వేసి బాత్రూంలో ఒక మూలన పెట్టండి. బాత్రూంలోని తేమకు సబ్బు నుంచి సువాసన వస్తుంది. దీంతో బాత్రూమ్ తాజాగా ఉంటుంది.