sleep : ఎక్కువ సేపు నిద్రపోతున్నారా? మీ పని అంతే ఇక..

Published : Feb 14, 2022, 04:50 PM IST

sleep : ఎక్కువ సేపు నిద్రపోయేవారికి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందులో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలను పక్కాగా ఎదుర్కోవాల్సి తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటుగా గుండెకు సంబంధించిన రోగాల బారిన పడే ప్రమాదముందని పేర్కొంటున్నారు.  

PREV
17
sleep : ఎక్కువ సేపు నిద్రపోతున్నారా? మీ పని అంతే ఇక..
sleep

sleep : ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. వీరు గుండె నాళాలకు సంబంధించిన రోగాలు, డిప్రెషన్, మధుమేహం, స్థూలకాయం వంటి అనేక సమస్యల బారిన పడే ప్రమాదముందని నిపుణులు ఇదివరకే తేల్చి చెప్పారు. అయితే కొంతమంది మాత్రం అతి నిద్రకారణంగా కూడా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

27

ఈ గజిబిజీ లైఫ్ లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే.. కొంతమంది మాత్రం సమయ సందర్భాన్ని వదిలేసి ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తున్నారు. సుమారుగా మనకు ఆరోగ్యానికి 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని మనకు తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం ఈ సమయం కంటే ఎక్కువ గంటలు నిద్రపోతున్నారు. దీనివల్ల వారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరస్తున్నారు.

37

ప్రస్తుత కాలంలో అతిగా నిద్రపోయే వారు చాలా అరుదుగానే ఉంటారు. కానీ ఉన్న కొద్ది మంది మాత్రం ఎక్కువ సమయం నిద్రించడానికే కేటాయిస్తున్నారట. వారు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అతిగా నిద్రించే వారు సోమరిపోతులుగా మారిపోయే అవకాశం ఉంటుందట. ఎక్కువ సేపు నిద్రించే వారిని వైద్యులకు చూపించడం మంచిదని సూచిస్తున్నారు. 

47

ఎక్కువ సేపు నిద్రపోయేవారు అధిక బరువు, ఊబకాయం, అలసట వంటి సమస్యలను తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు వీరికి గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వీటివల్ల అకాల మరణం సంభవించే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో 10 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రించే వారికే 41 శాతం కంటే ఎక్కువగా అకాల మరణాలు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని నిపుణులు స్పష్టం చేశారు.
 

57

అతిగా నిద్రపోయే వారే డిప్రెషన్, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రాత్రి పుష్టిగా నిద్రపోయి.. మళ్లీ మధ్యాహ్నం సమయంలో కూడా పడుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇలా పడుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కువ సేపు పడుకునే వారికి ఏకాగ్రత తక్కువ మొత్తంలో ఉంటుందట. అంతేకాదు వీరికి చేస్తున్న వర్క్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇలా ఎక్కువ గంటలు పడుకునే వారిలో తొందరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయట.   
 

67

ఇప్పుడున్న అతి నిద్ర ఫ్యూచర్ లో నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. మగవారికంటే ఆడవారే ఎక్కువగా నిద్రపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరికే గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయి. అంతేకాదు ఊబకాయులే ఎక్కువగా నిద్రిస్తున్నారట. ఓవర్ వెయిట్ కూడా అతినిద్రకు కారణమవుతుందని స్పష్టం చేశారు. 

77

ఈ అతినిద్రనుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరి. ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత వ్యాయామాలు, యోగా లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటిని చేయడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. బద్దకం, నిద్రమత్తు దెబ్బకు వదులుతాయి. వీటివల్ల మీ రోజు వారి పనులను కూడా చురుగ్గా చేసుకోగలుగుతారు. పగటి పూట నిద్రవచ్చినట్టు అనిపించినా పడుకోకండి. కేవలం రాత్రిళ్లు మాత్రమే నిద్రపోండి. పగటిపూట శరీరక శ్రమ ఎక్కువగా చేయండి. రాత్రి పడుకునే ముందు అలారమ్ సెట్ చేసుకోండి. దీనివల్ల ఎక్కువ సేపు పడుకోలేరు. 
 

Read more Photos on
click me!

Recommended Stories