Calories Burn in Sex: సెక్స్ తో ఇన్నికేలరీలు ఖర్చవుతాయా?

First Published | Feb 14, 2022, 4:00 PM IST

Calories Burn in Sex:  సెక్స్ తో ఆనందం, ఆరోగ్యమే కాదు మరెన్నో లాభాలున్నాయన్న సంగతి మీకు తెలుసా..? అవును సెక్స్ శరీరానికి Exercise లా కూడా పనిచేస్తుంది. జిమ్ లకు వెళ్లే అధిక కేలరీలను తగ్గించుకోవాలనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే మీ భాగస్వామితో కాసేపు సెక్స్ లో పాల్గొంటే చాలు ఈజీగా మీ శరీరంలో ఉన్న అధిక కేలరీలను ఇట్టే కరిగించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Calories Burn in Sex: వైవాహిక జీవితంలో సెక్స్ లైఫ్ చాలా ముఖ్యం. ఎందుకంటే భార్యా భర్తల బంధం బలంగా ఉండాలన్నా, ప్రేమతో మెలగాలన్నా సెక్స్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ సెక్స్  తో ఒత్తిడంతా పటాపంచలై మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. 
 


సెక్స్ వల్ల ఆనందం కలగడమే కాదు.. కేలరీలను కరిగించుకోవచ్చని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ExerciseS చేసినంత ఖర్చవకపోయినా.. కొన్ని కేలరీలు మాత్రం పక్కాగా ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక అర్థగంట పాటు రన్నింగ్ చేయడం వల్ల దాదాపుగా మగవారిలో 276 కేలరీలు ఖర్చైతే, ఆడవారిలో 213 కేలరీలు బర్న్ అవుతాయి. అదే సెక్స్ చేయడం వల్ల మగవారిలో 101, ఆడవారిలో 69 కేలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు

Latest Videos


అయితే సెక్స్ వల్ల ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువ కేలరీలు ఖర్చవడానికి ఓ కారణం కూడా ఉంది. ఆడవారికంటే మగవారే ఎక్కువ వెయిట్ ఉంటారు. అందులోనే సెక్స్ సమయంలో ఆడవారికంటే మగవారే చురుకుగా ఉంటారట. దీనివల్లే  వారి కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి మరి.

సెక్స్ Exercise కాకపోయినప్పటికీ మంచి వ్యాయామంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ కేలరీల ఖర్చు సంగతి పక్కన పెడితే..  శృంగారం వల్ల మూడ్ మారుతుంది. అంతేకాదు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా సెక్స్ వల్ల శరీర కండరాలన్ని Loose అవుతాయి. తద్వారా వారి శరీరానికి హాయినిచ్చే రసాయనాలు వ్యాపిస్తాయి. దీనివల్ల వారు ప్రశాంతంగా నిద్రపోతారు. దీన్ని బట్టి చూస్తే సెక్స్ వల్ల ఆనందమే కాదు.. ఆరోగ్యం కూడా ఉందని అర్థమవుతుంది కదూ..
 

మనిషికి నిద్ర ఎక్కువైనా, తక్కువైనా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని మనకు ఇదివరకే తెలుసు. అందుకే రాత్రి సమయంలో తొందరగా పడుకుని తొందరగా లేవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ విషయం Scientifically నిరూపించబడింది. ఈ విషయంపై మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా నిపుణులు వెల్లడించారు. పురుషులకు నిద్ర ఎక్కువైనా, తక్కువైనా వీర్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదముందని తేల్చి చెబుతున్నారు. 


ఈ విషయంపై అధ్యయనం చేయడం కోసం కొంతమంది పురుషులను ఎంచుకున్నారు. అందులో కొంతమందిని 9 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు, ఇంకొంతమందిని 7 నుంచి 8 గంటల సేపు పడుకోవాలని చెప్పారు. అనతరం వీళ్లపై పరిశోధనలు జరిపి అసలు విషయాన్ని వెల్లడించారు.
 


ఈ అధ్యయనంలో 9 గంటలకంటే ఎక్కువ సేపు, 6 గంటల కంటే తక్కువ సేపు నిద్రించిన వారిలో స్పెర్మ్ క్వాంలిటీ సరిగ్గా లేదని గుర్తించారు. ఎందుకంటే వీరికి తగినంతగా విశ్రాంతి దొరకలేదు. అలాగే ఆలస్యంగా పడుకోవడం కారణాల వల్లే ఇలా జరిగిందట. అంతేకాదు  వీరిలో Healthy sperm ను నాశనం చేసే ప్రోటీన్ ఎక్కువుగా ఉంటుందట. అదే 7 నుంచి 8 గంటల నిద్ర పోయే పురుషుల్లో ఇలాంటి సమస్యలేం కనిపించలేని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో వారికే సంతాన లేమి సమస్యలు ఎదురు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు . కాబట్టి వీరు రాత్రుళ్లు హాయిగా, తగినంత సమయం నిద్రపోవాలని సూచిస్తున్నారు. 
 

click me!