మీరు వారితో సురక్షితంగా ఉన్నారా?.. ఎలా తెలుసుకోవాలంటే??

First Published | Jul 28, 2023, 12:31 PM IST

రిలేషన్ షిప్ లో సంతోషం అంటే ఏంటో తెలుసా.. ఎదుటి వ్యక్తి సాంగత్యంలో సేఫ్ గా ఫీలవ్వడం, వారితో ఉంటే ఎంతో హాయిగా ఉన్నామన్న భావన కలగడం. 

బాడీ లాంగ్వేజ్ : మిమ్మల్ని ఎవరైనా ముట్టుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించకపోగా.. చాలా రిలాక్స్ డ్ గా అనిపించినట్లైతే ఆ వ్యక్తితో మీరు సేఫ్ గా ఉన్నరన్నదానికి తిరుగులేని సూచన.

మానసికంగా కృంగిపోయినప్పుడు..  : మిమ్మల్ని ఎదుటివారు ఏమనుకుంటారో, రిజెక్ట్ చేస్తారేమో అనే భావన లేకుండా మీ భావోద్వేగాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా షేర్ చేసుకోగలిగినట్లైతే మీరు సేఫ్ గా ఉన్నట్లే.

Latest Videos


చక్కగా వినడం : మీరు చెప్పేది ఎదుటి వ్యక్తి ఎలాంటి అంతరాయం కల్పిచకుండా.. డిఫెన్స్ లో పడకుండా వింటున్నట్లైతే అలాంటి వ్యక్తి మీ జీవితంలో తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఒకరి సాంగత్యంలో మరొకరు సురక్షితంగా ఉన్నారన్న భావన వచ్చినప్పుడు.. కంఫర్ట్ గా ఉంటారు. ఒకరి పరిమితులను మరొకరు గౌరవించుకుంటారు. దీనికి ఎలాంటి ఒత్తిడికీ లోనుకారు. 

Image: Getty

మీరు సురక్షితంగా ఉన్నారన్న భావన కలిగించే వాతావరణంలో మనస్పూర్తిగా నవ్వుతారు. చిలిపి చేష్టలు, చిన్నపిల్లల్లా మారిపోతారు. మీరు అలా ఉంటున్నట్లైతే సేఫ్ గా ఉన్నట్టే. 

రహస్యాలు ఉండవు : మీ వ్యక్తిగత విషయాలు, రహస్యాలు.. మీ ఆలోచనలు అన్నీ వారితో పంచుకుంటారు. ఎందుకంటే వారు ఇంకెవరికీ చెప్పరన్న నమ్మకం.

మీకు తనతో ఎలాంటి ఇబ్బందీ ఉండదనుకున్నప్పుడు మీ మద్య వచ్చే గొడవలు కూడా ఈజీగా సద్దుమణుగుతాయి. హెల్తీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. 

అతని సన్నిధిలో సురక్షితం అనుకున్నప్పుడు..ఒకరికి ఒకరు దగ్గరైనా ఫీల్ అవ్వరు. కౌగిలించుకున్నా, భుజం మీద తలవాల్చినా వేరే భావన ఉండదు.

click me!