సెక్స్ నిజంగా స్ట్రెస్ ను తగ్గిస్తుందా?

First Published | Jul 28, 2023, 11:49 AM IST

నిజానికి సెక్స్ తో బోలెడు లాభాలు కలుగుతాయి. రోజూ లేదా వారానికి రెండు, మూడు సార్లు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కొందరు చెబుతుంటారు. మరి దీనిలో నిజమెంతుందంటే?
 

ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సెక్స్ గురించి ఆలోచనే రాదు. కానీ ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఒత్తిడి  తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ మీకు తక్షణమే మూడ్ బూస్టర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది ఒత్తిడిని క్షణాల్లో మాయం చేస్తుంది. 
 

నిజానికి సెక్స్ ఒత్తిడిని తగ్గించుకోవడం వెనుక ఒక సాధారణ కారణం ఉందంటున్నారు నిపుణులు. అదే డోపామైన్ అని పిలువబడే హ్యాపీ హార్మోన్. సైన్స్ ప్రకారం.. సంభోగంలో పాల్గొన్నప్పుడు మీ శరీరం ఈ హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. ఇది మన మానసిక స్థితిని పెంచడమే కాకుండా రోగాలు కూడా తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది. అయితే మీరు మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండేటప్పుడు టచ్ థెరపీ కూడా మీకు మంచి మేలు చేస్తుంది. ఇది భావోద్వేగ భద్రతను పెంచుతుంది. అలాగే మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
 



సెక్స్ ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది?

సెక్స్ అంటే కేవలం శారీరక ఆనందం మాత్రమే కాదు. సెక్స్ కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. పునరుత్పత్తితో పాటుగా సెక్స్ అనేది సాన్నిహిత్యం, కోరికలకు సంబంధించినది. మీరు అనుకున్న దానికంటే సెక్స్ లో ఎన్నో ప్రయోజనాలను పొందుదతారు. సంవత్సరాలుగా లైంగికంగా చురుగ్గా ఉండే వ్యక్తులు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. శారీరక ఆరోగ్యం నుంచి మానసిక శ్రేయస్సు వరకు ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

Image: Getty Images


సెక్స్ తో కలిగే కొన్ని శారీరక ప్రయోజనాలు 

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియా, వైరస్లకు వ్యతిరేకంగా శరీరం ఎక్కువ ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి సెక్స్ సహాయపడుతుంది. ఇదెన్నో రోగాల ముప్పును తగ్గిస్తుంది. 
 

Image: Getty Images

లిబిడోను పెంచుతుంది

సంభోగం సమయంలో యోనిలో రక్త ప్రవాహం పెరుగుతుంది. దీంతో యోని స్థితిస్థాపకతను పొందుతుంది. ఇది మూత్రాశయ నియంత్రణకు దారితీస్తుంది. ఇది మహిళలు సాధారణంగా వయస్సుతో పాటు
ఎదుర్కొనే సమస్య. ఇది లూబ్రికేట్ ను పెంచుతుంది. సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image: Getty Images

కేలరీలను బర్న్ చేస్తుంది

సెక్స్ కూడా వ్యాయామంలా పనిచేస్తుంది. సెక్స్ లో శరీరంలోని ఎన్నో కండరాలు పాల్గొంటాయి. ముఖ్యంగా కటి కండరాలు పాల్గొంటాయి. సెక్స్ చేయడం వల్ల కొన్ని కేలరీలు బర్న్ అవుతాయి.

ఇది నొప్పిని తగ్గిస్తుంది

సెక్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది సహజ నొప్పి నివారణను అందించే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది నొప్పిని తగ్గిస్తుంది. 
 

గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

సెక్స్ హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కూడా సెక్స్ సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని

క్రమం తప్పకుండా సెక్స్ చేయడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వీర్యకణాల నాణ్యతను, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

సెక్స్ మానసిక ఆరోగ్య ప్రయోజనాలు 

ఒత్తిడిని తగ్గిస్తుంది

లైంగిక కార్యకాలాపాల్లో పాల్గొనడం వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది ఒత్తిడి, యాంగ్జైటీ ని తగ్గించడానికి సహాయపడుతుంది. 

నిద్రను ప్రేరేపిస్తుంది

సెక్స్ తర్వాత విడుదలయ్యే ప్రోలాక్టిన్ మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది. ఇది మీకు గాఢ నిద్రను కలిగిస్తుంది. 
 

ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

లైంగికంగా చురుగ్గా ఉండే వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది తమను తాము వ్యక్తీకరించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది ఆత్మగౌరవాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఫలితంగా మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. 

Latest Videos

click me!