చియా గింజలతో వెయిట్ లాస్.. అద్భుతమైన ప్రయోజనాలు..

First Published Aug 13, 2021, 1:33 PM IST

బరువు తగ్గడానికి అనేక మార్గాలు, డైట్ లు, వ్యాయామాలు, ఉపవాసాలు అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎక్కువగా సూచించే ముఖ్యమైన వాటిలో చియా గింజలు ఒకటి. వీటినే సబ్జా గింజలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యంతో పాటు, శరీరంలోని కొవ్వు మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల బరువు తగ్గడం సులభమవుతుంది. 

బరువు తగ్గడం.. నేటి రోజుల్లో ప్రతీ ఒక్కరి అల్టిమేట్ గోల్ అదే. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. బరువు తగ్గడం కేవలం అందం కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా. ఉండాల్సిన దానికంటే అధికంగా ఉండే బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నేటి కాలుష్య భరితమైన, ఒత్తిడితో కూడిన సమయాల్లో ఇది మరింత ఎక్కుగా కనిపిస్తుంది. 

అయితే బరువు తగ్గడానికి అనేక మార్గాలు, డైట్ లు, వ్యాయామాలు, ఉపవాసాలు అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎక్కువగా సూచించే ముఖ్యమైన వాటిలో చియా గింజలు ఒకటి. వీటినే సబ్జా గింజలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యంతో పాటు, శరీరంలోని కొవ్వు మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల బరువు తగ్గడం సులభమవుతుంది. 

అసలు చియా విత్తనాలు అంటే ఏమిటి అంటే.. ఇవి చిన్న నల్ల విత్తనాలు, మెక్సికన్ పుదీనా కుటుంబంలోనివి. వీటిలో కార్బోహైడ్రేట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎన్నో ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. 

అందుకే చియా గింజలను పుడ్డింగ్‌లు, స్మూతీ బౌల్స్, జ్యూస్‌లు, వోట్ మీల్ లలో అంతర్భాగంగా వాడతారు. పెరుగుతో కూడా చియా గింజలను తీసుకుంటారు. వీటితో పాటు రకరకాల వంటకాలలో ఉపయోగిస్తారు. నీళ్లలో కూడా చియా విత్తనాలు వేసుకుని తాగుతారు. నీటిలో వేసినప్పుడు చియాగింజలు ఉబ్బుతాయి. ఉబ్బి మందపాటి జెల్ గా తయారవుతాయి. అందుకే చాలామంది బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా చియా గింజలను తమ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేరుస్తారు.
undefined

చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే ఇది ఎక్కువ సేపు పొట్టను నిండుగా ఉంచుతుంది. దీనివల్ల ఆకలి వేయకపోవడం వల్ల అధికంగా తినరు. దీంతో బరువు తగ్గే ప్రక్రియ సులభం అవుతుంది. రెండు టేబుల్ స్పూన్ల చియా గింజల్లో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. చియాగింజల్లోని ఫైబర్ శాతం రోజువారీ తీసుకునే ఫైబర్ లో 40 శాతం ఇదే ఉంటుంది. 

ఆకలిని అణచివేస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు ఆకలి కాదు. అలాగని చియా గింజలు మ్యాజిక్ మందు కాదు. అది ఒంటరిగా బరువు తగ్గడంలో సహాయపడినా.. అంత ప్రభావవంతంగా ఉండదు. కాబట్టి మిగతావాటితో కలిసి తీుకుంటే ప్రతిభావంతంగా పనిచేస్తాయి. 

click me!