గర్భిణులు మెహందీ పెట్టుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?

Published : Jan 21, 2025, 05:35 PM IST

సాధారణంగా మెహందీ అంటే ఆడవాళ్లకు చాలా ఇష్టం ఉంటుంది. పెళ్లి, ఫంక్షన్, పండగా, సంతోషకరమైనా సందర్భమేదైనా సరే.. చాలా మంది ఆడవాళ్లు మోచేతి నుంచి మునివేళ్ల వరకు మంచి మంచి డిజైన్లు వేసుకుంటారు. అయితే ప్రెగ్నెంట్స్ మెహందీ పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే దానివల్ల ఏమైనా చెడు జరుగుతుందా? అసలు శాస్త్రం ఏం చెబుతోంది.

PREV
15
గర్భిణులు మెహందీ పెట్టుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?

ఆడవాళ్లు విపరీతంగా ఇష్టపడేవాటిలో మెహందీ ఒకటి. చేతులు ఎర్రగా పండితే వారి సంతోషానికి హద్దే ఉండదు. చేతులే కాదు, కాళ్లకు కూడా వాటికి తగ్గ డిజైన్లు వేసుకొని సంతోషపడుతుంటారు ఆడవాళ్లు. ఇక పెళ్లి, ఫంక్షన్, పండగల టైంలో అయితే పోటీపడి మరీ మెహందీ పెట్టుకుంటారు. అయితే గర్భిణీలు మెహందీ పెట్టుకోవడంపై చాలా మందిలో సందేహాలున్నాయి.

25
పెద్దల మాట

సాధారణంగా ప్రెగ్నెంట్స్ కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే గర్భధారణలో శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. దానికి అనుగుణంగా పెద్దలు సూచనలు చేస్తుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గర్భిణులు మెహందీ పెట్టుకోవచ్చా లేదా అంటే.. పెట్టుకోవచ్చనే చెబుతున్నాయి శాస్త్రాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మెహందీ శుక్ర గ్రహానికి సంబంధించింది. ఇది అందం, ఆనందం, ప్రేమ, సృజనాత్మకతను సూచిస్తుంది. కాబట్టి మెహందీ పెట్టుకోవడం వల్ల శుక్రుడి శక్తి పెరిగి శ్రేయస్సు కలుగుతుంది. మెహందీ అందాన్ని పెంచడంతోపాటు.. శరీరానికి చలువ చేస్తుంది.

35
వీళ్లు మెహందీ పెట్టుకోకపోవడం మంచిది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గర్భధారణ సమయంలో గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెహందీ శుక్ర గ్రహానికి సంబంధించింది కాబట్టి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే, మెహందీ పెట్టుకుంటే సానుకూల శక్తికి బదులు ప్రతికూల శక్తి వస్తుంది. ఇది భావోద్వేగాలు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మనశ్శాంతి దెబ్బతింటుంది. గర్భధారణలో శని, రాహు, కేతువు బలంగా ఉంటే, మెహందీ పెట్టుకుంటే చింత, సమస్యలు వస్తాయి.

45
ఎప్పుడు మెహందీ పెట్టుకోవచ్చు?

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మెహందీ పెట్టుకోవాలంటే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేనప్పుడు, గ్రహాలు, నక్షత్రాలు బాగున్నప్పుడు గర్భిణీలు మెహందీ పెట్టుకోవచ్చు.

55
డాక్టర్ సలహా పాటించండి

గర్భధారణలో హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో వేడి పెరిగి అలసట, చిరాకు వస్తాయి. మెహందీ ఆకులు చలువ చేసేవి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దురద, మంట నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే, మెహందీ వల్ల కొంతమందికి ఎక్కువ చలువ చేసి జలుబు, దగ్గు, జ్వరం వంటివి కూడా రావొచ్చు. కాబట్టి వాడే ముందు శరీర స్థితిని అర్థం చేసుకుని, డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే వాడండి.

ముఖ్యంగా.. గర్భిణీలు కృత్రిమ, రసాయనాలతో తయారు చేసిన మెహందీని వాడకపోవడం ఉత్తమం.

click me!

Recommended Stories