బొప్పాయి గుజ్జును ముఖానికి రాయడం వల్ల అందులో ఉండే పపైన్ ఎంజైమ్ చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ పెరగడానికి సాయపడతాయి. దీనివల్ల చర్మం చాలా మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉన్న మొటిమల మచ్చలు, ట్యానింగ్ తగ్గడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
బొప్పాయి ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులువు. బాగా పండిన బొప్పాయి ముక్కను తీసుకోవాలి. ఈ ముక్కలను బాగా మెత్తగా చేసి, అందులో ఒక చెంచా తేనె, అర చెంచా పెరుగు కలపండి. ఇలా తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు ఉంచుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి. ఈ ప్యాక్‌ను వారానికి మూడు, నాలుగు సార్లు అప్లై చేస్తే చాలు ముఖానికి మెరుపు వచ్చేస్తుంది.