వెల్లుల్లిలో యాటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. వెల్లుల్లి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందని తేలింది.
మనం తినే కూరల్లో వెల్లుల్లి పక్కాగా ఉంటుంది. కానీ మనకు తెలియని ఎన్నో ఔషదగుణాలు ఈ చిన్న వెల్లుల్లిలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో దీనిని కొన్ని ఏండ్ల నుంచి రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ వెల్లుల్లిలో బీపీ తగ్గించే ఎన్నో ఔషద గుణాలున్నాయి. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి 'అల్లిసిన్' అనే సమ్మేళనం సహాయపడుతుంది.
26
వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. పలు అధ్యయనాల ప్రకారం.. వెల్లుల్లితో సహజ పద్దతుల ద్వారా అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చని చెప్తున్నాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 12 ట్రయల్స్ లో పాల్గొన్న 553 మంది రక్తపోటును వెల్లుల్లి సమర్థవంతంగా నియంత్రించిందని తేలింది.
36
అయితే వెల్లుల్లి కొంతమందికి మంచిది కాదు.. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించే మందులు తీసుకునే వారు, రక్తస్రావం అయ్యే వారు వెల్లుల్లి సప్లిమెంట్లను తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ డిక్సా భావ్సర్ ప్రకారం.. వెల్లుల్లి సప్లిమెంట్లను వేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.
46
డిసెంబర్ 2021 లో.. మా నాన్న అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆయన అప్పటి నుంచి ఉదయం 1 లవంగం, వెల్లుల్లిని రెగ్యులర్ గా తినేవారు. దీంతో రక్తపోటు నియంత్రణలోకొచ్చిందని డాక్టర్ భావ్సర్ చెప్పారు.