ముఖేష్ అంబానీ అతిథుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

First Published Mar 6, 2024, 2:30 PM IST

మూడు రోజుల పాటు ఎంతో గ్రాండ్ గా జరిగిన ఆనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఫ్రీ వెడ్డింగే ఇప్పుడు దేశం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అంబానీ ఫ్యామిలీ ఎంత రిచ్ అన్న సంగతి లోకమంతటా తెలిసిందే. అయితే ఈ ఫ్రీ వెడ్డింగ్ కు వచ్చిన అతిథుల కోసం అంబానీ అందించిన లగ్జరీలు తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరంటే నమ్మండి. 
 


అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. వీరి ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగింది. ఇక ఈ వేడుకకు ప్రపంచ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, స్టార్ట్, సెలబ్రిటీలు, ప్రపంచ బిలియనీర్లతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హైప్రొఫైల్ అతిథులు పాల్గొన్నారు.ఇక ఈ  ఈవెంట్ గ్రామీ అవార్డు గ్రహీత గాయని రిహన్నా ప్రదర్శనతో ప్రారంభమైంది. అయితే ఈమె ఈ ప్రదర్శనకు అంబానీ ఫ్యామిలీ ఏకంగా కొన్ని కోట్లు ఖర్చు చేశారంట. సమాచారం ప్రకారం.. 8 నుంచి 9 మిలియన్ డాలర్లు ఈ ప్రదర్శనకు కుమ్మరించారట.
 

ఇకపోతే జామ్ నగర్ లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చిన అతిథుల కోసం అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన మర్యాదలు తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. అవును ఈ ఈవెంట్ కు వచ్చిన అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ  విలాసవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఏర్పాటు చేసింది. వీటిలో ముంబై, ఢిల్లీ నుంచి జామ్ నగర్ కు చార్టర్డ్ విమానాలు, ప్రపంచ స్థాయి చెఫ్ లు, వార్డ్ రోబ్ సేవలు, అతిథుల కోసం విలాసవంతమైన కార్లు, రిహానా, అరిజిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్, అజయ్-అతుల్ తో సహా అనేక మంది ప్రసిద్ధ కళాకారుల సంగీత ప్రదర్శనలంటూ ఎన్నో ఉన్నాయి. అంబానీ ఫ్యామిలీ వేడుక అంటే ఈ మాత్రం ఉంటుంది మరీ అని లోకానికి తెలియజేశారు.
 

ఈ ఫ్రీవెడ్డింగ్ వేడుకకు సుమారుగా 1,000 మంది అతిథులు హాజరయ్యాని సమాచారం. అలాగే అంబానీ కుటుంబం ఇండోర్ లోని జార్డిన్ హోటల్ నుంచి 21 మంది చెఫ్ ల బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరితో జపనీస్, థాయ్, మెక్సికన్, పార్సీ థాలీతో సహా ఎన్నో రకాల గుమగుమలాడే వంటకాలను తయారుచేయించారు. ఇకపోతే బ్రేక్ ఫాస్ట్ కోసం ఏకంగా 75 రకాల వంటకాలు, మధ్యాహ్న భోజనానికి 225 రకాల వంటకాలు, రాత్రి భోజనానికి దాదాపు 275 రకాల ఫుడ్స్, రాత్రి పూట 85 రకాల వంటకాలను అందుబాటులో ఉంచారు. అలాగే ఇండోర్ కు చెందిన చెఫ్లకు ఒక స్పెషల్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ వాళ్లు సాంప్రదాయ ఇండోర్ వంటకాలను అందించారు. 

ప్రీ వెడ్డింగ్ పార్టీకి హాజరయ్యే అతిథులకు లాండ్రీ, ఎక్స్ ప్రెస్ బట్టలు, చీరలు, హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులతో సహా ఎన్నో రకాల సేవలను అందుబాటులో ఉంచారు. జామ్ నగర్ విమానాశ్రయం నుంచి అంబానీ గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్ కు అతిథులు వెళ్లడానికి అంబానీలు రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, బీఎమ్ డబ్ల్యూతో సహా లగ్జరీ కార్లను కూడా అందించారు.
 

click me!