అంబానీ కుటుంబంలో ఎవరు ఎంత చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారో తెలుసా?

First Published Mar 6, 2024, 1:41 PM IST

ముఖేష్ అంబానీ ఎంత పెద్ద ధనవంతుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముఖేష్ అంబానీ, వాళ్ల సతీమణీ నీతా అంబానీ, వీళ్ల పిల్లలు ఏ చదివారు? ఎక్కడ చదివారో తెలిస్తే షాక్ అవుతారు తెలుసా? 

Ambani family

ముఖేష్ అంబానీ ఎంత పెద్ద పారిశ్రామికవేత్తో మనందరికీ తెలిసిందే. ఇండియాలో ఉన్న సంపన్న రాజవంశాల్లో అంబానీ ఫ్యామిలీ ఒకటి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు పెట్రోకెమికల్స్, టెలికాం, రిటైల్ సహా ఎన్నో రంగాలు ఉన్నాయి.

అంబానీ కుటుంబం

ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఇండియాలో ఎడ్యుకేషన్, గేమ్స్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇకపోతే ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారు  ఆకాష్, ఇషా, ఆనంత్. ముఖేష్ అంబానీ దంపతుల చిన్న కొడుకు ఆనంతో అంబానీ ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఈ మధ్యే ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు స్టార్ క్రికెట్ల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు వెళ్లారు. దీన్ని చూసిన వారంతా అంబానీ తలచుకుంటే జరగనిదంటూ ఏదీ ఉండదు అని అనుకుంటున్నారు. మరి ఇంత పెద్ద ధనవంతుల కుటుంబ సభ్యులు ఏం చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ ముంబై విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు. ముంబైలోని హిల్ గ్రాజ్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసారు. ముఖేష్ అంబానీ ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదుకుకున్నారు. ఇక ఈయన 1980లో రిలయన్స్ లో చేరారు.
 

నీతా అంబానీ

ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ముంబైలోని నార్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందారు. నీతా అంబానీ భరతనాట్య కళాకారిణి. కెరీర్ మొదట్లో ఆమె టీచర్ గా కూడా పనిచేశారు. 
 

ఆకాశ్ అంబానీ

ముకేశ్, నీతా అంబానీల పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఈయన ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను కంప్లీట్ చేశాడు. 

ఇషా అంబానీ

ఆకాశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ యేల్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ చదివింది. ఈమెకూడా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లోనే పాఠశాల విద్యను కంప్లీట్ చేసింది. ఇషా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
 

Anant Ambani

అనంత్ అంబానీ

ముకేశ్, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ కూడా బ్రౌన్ యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. తన అన్న, అక్కల మాదిరిగానే ఆనంత్ కూడా తన పాఠశాల విద్యను ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లోనే పూర్తి చేశాడు. 

మెహతా అంబానీ

వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా.. అంబానీ కుటుంబానికి పెద్ద కోడలు. ఈమెకు, ఆకాశ్ అంబానీకి 2019లో పెళ్లి జరిగింది. ఈమె న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి లా డిగ్రీ పట్టా అందుకున్నారు. 
 

ఆనంద్ పిరమల్

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక అల్లుడు ఆనంద్ పిరమల్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఇంతకంటే ముందు ఈయన న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆంత్రోపాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందారు. ఈయన 2018లో ఇషా అంబానీని పెళ్లాడాడు.
 

రాధికా మర్చంట్

బిజినెస్ టైకూన్ వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్ ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మోంటియల్ వరల్డ్ స్కూల్లో లో చదివారు. న్యూయార్క్ యూనివర్శిటీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ చదువుకున్నారు. నీతా అంబానీ లాగే రాధిక కూడా భరతనాట్య కళాకారిణి.

click me!