స్వైన్ ఫ్లూ: లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Published : Aug 21, 2022, 11:56 AM IST

స్వైన్ ఫ్లూ:   హెచ్1ఎన్1 ఫ్లూ వైరస్ (స్వైన్ ఫ్లూ) ఎన్నో రకాల ప్లూ వైరస్ జన్యువులతో తయారైతుంది.  సాధారణంగా ఈ వైరస్ పక్షులు, పందులు, మనుషులకు వ్యాపిస్తుంది. ఈ స్వైన్ ఫ్లూ సాధారణ ఫ్లూ లాగే శ్వాస సమస్యలు, న్యూమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి  సమస్యలకు దారితీస్తుంది. 

PREV
19
స్వైన్ ఫ్లూ:  లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
swine flu

"స్వైన్ ఫ్లూ" ఇన్ఫ్లుఎంజా  లేదా H1N1 అని పిలవబడేది ఒకరకమైన అంటువ్యాధి.  శ్వాసకోశ వ్యాధి. 2009 లో ఈ ఫ్లూను గుర్తించారు. ఈ వ్యాధి ఎక్కువగా పందులకు వస్తుంది. దీనికి కారణం స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుఎంజా అనే వైరస్ పందులకు సోకడం. ఇకపోతే ఇది మనుషులకు రాదు. కానీ ఇది అంటురోగం కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఇది సోకితే శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యూమోనియా వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది షుగర్ పేషెంట్లకు సోకితే వారి పరిస్థితి మరింత దిగజారొచ్చు. 

29

H1N1 వైరస్ కారణాలు:

ఈ స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుఎంజా వైరస్ గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లోని కణాలకు సోకుతుంది. కలుషితమైన గాలిని పీల్చినప్పుడు లేదా ఈ వైరస్ ఉన్న ఉపరితలాన్ని తాకి.. చేతులతో నోటిని లేదా కళ్లను, ముక్కును తాకితే అది నేరుగా మన శరీరంలోకి వెళుతుంది. 

39
swine flu

H1N1 వైరస్ కొన్ని సాధారణ లక్షణాలు

గొంతు నొప్పి

చలి

ముక్కు కారడం

కంటి నుంచి నీరు కారడం, ఎరుపెక్కడం, దురద

ఒళ్లు నొప్పులు

విపరీతమైన జ్వరం

దగ్గు

కళ్లు తిరగడం

వాంతులు

శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది
 

49

స్వైన్ ఫ్లూ నివారణా చర్యలు

ఇంట్లోనే ఉండండి

స్వైన్ ఫ్లూ బారిన పడ్డవారు ఇంట్లో ఉండటమే సేఫ్. ఎందుకంటే ఇది అంటువ్యాధి. మీ వల్ల ఇంకొకరికి సోకే ఛాన్సెస్ ఉన్నాయి.  అందుకే ఇది పూర్తిగా తగ్గేవరకు ఇంట్లోనే ఉండండి.
 

59
hand wash

చేతులను తరచుగా కడుగుతూ ఉండండి

స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నవారు తరచుగా చేతులను క్లీన్ చేసుకుంటూ ఉండాలి. భోజనానికి ముందు తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవడం మర్చిపోకూడదు. 
 

69
h1n1 fever

దగ్గు, తుమ్ములు

ఇక ఫ్లూ వచ్చిందంటే తుమ్ములు, దగ్గు సర్వసాధారణమే. కానీ ఇలాంటి వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి చేతిరుమాలును అడ్డుపెట్టుకోవాలి. ముఖ్యంగా వీరి ముఖానికి మాస్క ఎప్పుడూ ఉండాలి. దీనివల్ల మీ చేతులు కలుషితం కాకుండా ఉంటాయి. అయితే మీ చేతిరుమాలును మాత్రం తరచుగా మారుస్తూ ఉండాలి. 

79

సమూహాలకు దూరంగా ఉండండి

స్వైన్ ఫ్లూ బారిన పడితే వీలైనంత వరకు ఇతరులతో క్లోజ్ గా ఉండటం మానేయండి. గుంపుల్లోకి కూడా వెల్లకండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలి వాళ్లకు, గర్భిణులకు దూరంగా ఉండండి. ఇది వారికి తొందరగా వచ్చే సోకే ప్రమాదం ఉంది. ఇకపోతే మీరు రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ  ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి. 
 

89

హైడ్రేట్ గా ఉండండి

హెల్త్ బాలేనప్పుడు శరీరాన్ని వీలైనంత ఎక్కువ హైడ్రేట్ గా ఉంచాలి. ఇందుకోసం పుష్కలంగా నీళ్లను తాగడంతో పాటుగా కొబ్బరి నీరు, కూరగాయల  జ్యూస్ లు, వేడి వేడి సూప్ లు, ఫ్రెష్ పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. 
 

99
sleeping

నిద్ర

మీకు తెలుసా.. మన రోగాలు సగం నిద్రలోనే తక్కువ అవుతాయట. అందుకే ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి. వీలైనంత ఎక్కువ సేపు పడుకోండి. నిద్రవల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది సంక్రమణ నుంచి మిమ్మల్ని త్వరగా బయటపడేస్తుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories