అంబానీ పెద్ద కోడలు..
ముకేష్ అంబానీ మన దేశంలోనే అత్యంత ధనవంతుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి అధినేత అయిన ఆయన తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటాడు. ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా.. ముకేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా నెట్టింట వైరల్ గా మారింది. శ్లోకా ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె దుస్తులు, జ్యూవెలరీ, తన వాచ్ , హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. కాగా, తాజాగా ఆమె ధరించిన ఓ బ్రేస్లెట్ నెట్టింట వైరల్ గా మారింది.