చంకల్లో నల్లగా ఉండటం వల్ల చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల స్లీవ్ లెస్, మోడర్న్ డ్రెస్ లు వేసుకోలేకపోతుంటారు. అయితే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం
చంకల్లో నల్లగా ఉండటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటారు. చేతులు ఎత్తడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ముఖ్యంగా స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోలేకపోతుంటారు. చంకల కింద నల్లగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. హార్మోన్ల మార్పులు, చెమట, చర్మంలో అలర్జీ, వెంట్రుకలు తీయడానికి రేజర్ ఇంకా క్రీమ్ వాడటం లేదా ఎక్కువగా డియోడ్రెంట్ వాడటం లాంటి కారణాల వల్ల చంకలు నల్లగా మారుతుంటాయి.
26
చంకల్లో నలుపు తగ్గడానికి..
చంకల్లో నలుపు పోగొట్టడానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అవి చాలా వరకు ఫలితం ఇవ్వవు. అలాంటి పరిస్థితుల్లో కలబంద జెల్ బాగా ఉపయోగపడుతుంది. కలబంద జెల్ చంకల్లో ఉండే నలుపును సులువుగా తగ్గిస్తుంది. కలబందలో ఉండే గుణాలు చర్మంపై ఉండే మచ్చలు ఇంకా నల్లటి మరకలను పోగొట్టడానికి బాగా పనిచేస్తాయి. చర్మం రంగును కూడా మెరుగుపరుస్తాయి. చంకల్లో నలుపు పోగొట్టడానికి కలబంద జెల్ ను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
36
కలబంద జెల్, రోజ్ వాటర్:
చంకల్లో నలుపు పోగొట్టడానికి కలబంద జెల్ తో రోజ్ వాటర్ కలిపి దాన్ని చంకల్లో రాసి 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో కడగాలి. దీన్ని కంటిన్యూగా చేస్తూ ఉంటే త్వరగా మంచి ఫలితం వస్తుంది.
46
కలబంద జెల్, నిమ్మరసం:
నిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ఉండే నల్లటి మచ్చలను పోగొట్టడానికి, రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కలబంద చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. 2 స్పూన్ల కలబంద జెల్ తో, 1 స్పూన్ నిమ్మరసం కలిపి దాన్ని చంకల్లో రాసి కాసేపు అలాగే ఉంచిన తర్వాత నీటితో కడగాలి. ఈ చిట్కాను వారానికి 2, 3 సార్లు పాటించవచ్చు.
56
కలబంద జెల్, పసుపు:
పసుపులో ఉండే బ్యాక్టీరియా నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మంపై ఉండే మురికిని శుభ్రం చేయడానికి, చర్మం నలుపును పోగొట్టడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 2 స్పూన్ల కలబంద జెల్ తో, కొద్దిగా పసుపు పొడి కలిపి బాగా కలిపి దాన్ని చంకల్లో రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఈ పద్ధతిని వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించవచ్చు.
66
కలబంద జెల్, బియ్యం పిండి:
బియ్యం పిండి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకా చర్మంపై ఉండే మురికి, నలుపును తొలగించడానికి సహాయపడుతుంది. దీనికి 2 స్పూన్ల కలబంద జెల్ తో, 2 స్పూన్ల బియ్యం పిండి కలిపి చంకల్లో రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.