అభిషేకానికి ఏమేమి కావాలి?
మహాశివరాత్రి రోజున పూజ, అభిషేకానికి కొన్ని సాధారణ సామాగ్రి అవసరం. ఇందులో స్వచ్ఛమైన నీరు, పాలు, పెరుగు, తేనె, గంగా జలం, బిల్వ పత్రం, గంధం, ధూపం, దీపం , పండ్లు లాంటివి అవసరం.
సానుకూల శక్తి నిలబడుతుంది
శివుడికి పాలు, పెరుగు, పవిత్ర జలం సమర్పించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. పాలు , పెరుగు శాంతి,స్వచ్ఛతకు చిహ్నాలుగా భావిస్తారు.