Watermelon: ఎండాకాలంలో పుచ్చకాయ ఎక్కువ తింటే ఏమౌతుంది?

Published : Feb 25, 2025, 03:38 PM IST

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో  చాలా పోషకాలు ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్న పుచ్చకాయను ఎక్కువగా తింటే ఏమౌతుంది?    

PREV
17
Watermelon: ఎండాకాలంలో పుచ్చకాయ ఎక్కువ తింటే ఏమౌతుంది?

ఎండాకాలం వచ్చేసింది.  బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల వేడి నుంచి ఉపశమనం పొందడానికి అందరూ చేసేది పుచ్చకాయ తినడం. రుచికి తియ్యగా ఉండటం.. అందుబాటు ధరలో లభించడంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. నిజానికి, ఎండాకాలంలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.  మన శరీరానికి చల్లగా ఉంచడంతో పాటు.. హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే.. దీనిలో 92శాతం నీరు ఉంటుంది.

 

27

పుచ్చకాయలో  చాలా పోషకాలు కూడా ఉన్నాయి. దీనిలో  విటమిన్లు ఏ, బి6, సి, బి1, బి5, బి9 ఉన్నాయి. ఇవి కంటి చూపు, రోగనిరోధక శక్తి, జీవక్రియ, మెదడు అభివృద్ధి, చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి.

పుచ్చకాయలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. దీని వల్ల చాలా లాభాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వస్తాయి. పుచ్చకాయ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలేంటో ఈ పోస్ట్ లో తెలుసుకోండి.

37

విరేచనాలు: పుచ్చకాయలో నీరు, సహజ చక్కెరలు, ముఖ్యంగా ఫ్రక్టోజ్ ఎక్కువ. ఎక్కువ పుచ్చకాయ తింటే కడుపులో గ్యాస్, విరేచనాలు అవుతాయి. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవాళ్లు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పుచ్చకాయను ఎక్కువగా తినకూడదు. పుచ్చకాయలో నీరు, ఫైబర్ ఎక్కువ కాబట్టి కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వస్తాయి.

47

రక్తంలో చక్కెర పెరుగుదల: పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది, ముఖ్యంగా ఎక్కువగా తిన్నప్పుడు. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్లకు చక్కెర స్థాయి పెరగవచ్చు.

57

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత: పుచ్చకాయలో నీరు ఎక్కువ కాబట్టి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మెగ్నీషియం) సమతుల్యం కాకుండా ఎక్కువ తింటే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది.

67

అలెర్జీలు: చాలా అరుదుగా కొందరికి పుచ్చకాయ వల్ల అలెర్జీ వస్తుంది. దురద, దద్దుర్లు వంటి తేలికపాటి లక్షణాల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన సమస్యలు కూడా వస్తాయి.

 

77

ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే, పుచ్చకాయను తక్కువగా తినడం మంచిది. మీకు ఆరోగ్య సమస్యలు లేదా ఆహారపరమైన సమస్యలు ఉంటే తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. 

click me!

Recommended Stories