Dandruff: ఎన్ని ప్రయత్నాలు చేసినా చుండ్రు తగ్గడం లేదా? కొబ్బరి నూనెలో ఈ రెండింటి కలిపి పెడితే ఫసక్‌

Published : Feb 09, 2025, 01:14 PM IST

పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇటీవల చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో మార్కెట్లో లభించే రకరకాల షాంపూలను, క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే సహజ పద్ధతిలో చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. కలబందతో ఇలా చేస్తే త్వరగా చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.   

PREV
13
Dandruff: ఎన్ని ప్రయత్నాలు చేసినా చుండ్రు తగ్గడం లేదా? కొబ్బరి నూనెలో ఈ రెండింటి కలిపి పెడితే ఫసక్‌
dandruff

కలబంద పెంపంకం చాలా సులభం. ఇంట్లో చిన్న బకెట్లలో కూడా అలొవెర మొక్కను పెంచుకోవచ్చు. ఇలా విరివిగా లభించే అలొవేరాతో చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. కలబంద, కొబ్బరి నూనె, చక్కెరతో చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇంతకీ అలొవెర, చక్కెరను ఎలా ఉపయోగించాలి.? అలొవెరా చుండ్రును తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

23

తయారీ విధానం.. 

ఇందుకోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ను సేకరించాలి. ఆ తర్వాత కలబంద జెల్‌లో 1 టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనెను వేసుకోవాలి. అదే విధంగా ఒక టేబుల్‌ స్పూన్‌ చక్కెరను వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ను తలకు బాగా అప్లై చేయాలి. మాడుకు పూర్తిగా తగిలేలా అప్లై చేయాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇందుకోసం లైట్‌ షాంపూలను ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలు చుండ్రు సమస్య పరార్‌ అవ్వాల్సిందే. 

జాగ్రత్త: అయితే చక్కెర విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అధిక చక్కెర వాడకంతో వెంట్రుకలు అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలోనే చక్కెరను ఉపయోగించడం మంచిది. 
 

33

ఎలా పనిచేస్తుంది.? 

అలోవెరాలో యాంటీ-ఫంగల్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలపై భాగంలో ఉండే చర్మం తేమగా ఉంటుంది. దీంతో చర్మం పొడిబారదు ఇది చుండ్రును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ తల చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. చక్కరతో స్క్రబ్‌ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించాలి. దీర్ఘకాలంగా చుండ్రు సమస్యతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. 
 

click me!

Recommended Stories