ఫేషియల్ చేయించుకోవడం అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. రొటీన్ గా అయితే నార్మల్ ఫేషియల్స్, అకేషన్స్ అప్పుడు కాస్ట్లీ ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు ఆడవాళ్లు. అయితే ఏ ఫేషియల్ కి తగ్గ బ్రైట్నెస్ అఫేషియల్ కి వస్తుంది. అయితే ఫేషియల్ చేయించుకోగానే మీ పని అయిపోయిందా అంటే కాదని అంటున్నారు నిపుణులు.
ఫేషియల్ తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మన ఫేస్ గ్లో నిలబడుతుంది. లేదంటే మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చర్మం తిరిగి కాంతివిహేనంగా మారుతుంది. నిజానికి ఫేషియల్ చేయించుకోవడం చర్మానికి చాలా మంచిది. చర్మంపై ఉండే రక్తప్రసరణను శోషరస ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఫేషియల్ చేయించుకున్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. శరీరాన్ని హైబ్రిటేట్ గా ఉంచుకోవాలి నాణ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలి. అలాగే ఫేషియల్ చేయించుకున్న తర్వాత మొత్తం ఎర్రగా మారిన మొటిమలు వంటి ఎలర్జీ వచ్చినా వెంటనే వైద్యులని సంప్రదించాలి.
ఫేషియల్ తర్వాత చర్మం పొడిబారినట్లుగా అనిపిస్తుంది కాబట్టి తేమను పొందటానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే ఫేషియల్ అయిపోయిన వెంటనే మర్చిపోకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. ఎస్ పి ఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ఎంచుకోవటం మర్చిపోవద్దు.
అలాగే ఫేషియల్ చేయించుకున్న తరువాత వెంటనే వ్యాక్సింగ్ చేయించుకోకండి. ఫేషియల్ చేయించుకోవడానికి రెండు రోజులు ముందే వ్యాక్సింగ్ చేయించుకోండి. ఫేషియల్ తర్వాత వ్యాక్సింగ్ చేస్తే చర్మ రంద్రాల్లోకి బ్యాక్టీరియా చేరుతుంది. అలాగే ఫేషియల్ చేయించుకున్న వెంటనే మేకప్ వేసుకోవడం, కాస్మెటిక్స్ వాడటం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి వెళ్తాయి. ఇది మొటిమలు రావడానికి కారణం అవుతుంది.
కాబట్టి వెంటనే మేకప్ వేయకండి. అలాగే మేకప్ అయిన వెంటనే చెమట పట్టే అంత వేడి ప్రాంతాల్లో ఉండకండి. అలాగే స్టీమ్ బాత్, హాట్ వాటర్ బాత్ చేయకండి. దీనివలన చర్మం ఎర్రబారే అవకాశం ఉంది. కాబట్టి ఫేషియల్ చేయించుకున్న తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలతో ఆ ఫేషియల్ యొక్క గ్లో ఎక్కువకాలం వచ్చేలాగా మెయింటైన్ చేయండి.