Health Tips: రాత్రిపూట స్నానం చేయడం మంచిదేనా.. నిజా నిజాలు తెలుసుకుందాం!

First Published | Sep 18, 2023, 11:52 AM IST

Health Tips: రెండు పూటలు స్నానం చేయటం మంచిది అని కొందరు అంటారు. కానీ కొందరు అది అంత మంచి పద్ధతి కాదు అంటారు. అయితే రాత్రిపూట స్నానం చేయడం మంచిదా కాదా అని ఇక్కడ తెలుసుకుందాం.
 

 మండువేసవిలో ఒకటే ఉక్కపోత. ఆ సమయంలో ఒళ్లంతా చెమట,జిడ్డు వలన చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఒకసారి ఏమిటి ఎన్నిసార్లు చేయమన్నా స్నానానికి సిద్ధమే. అలాగే చాలామందికి రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం అలవాటు. దుమ్ము ధూళితో కూడుకున్న శరీరంతో ఇంటికి వచ్చిన ఉద్యోగులకి రెండవ పూట స్నానం తప్పకపోవచ్చు.

 ఇలా రెండు పూట్ల స్నానం చేయటం వల్ల లాభమా, నష్టమా  ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లాభాల సంగతి చూద్దాం రాత్రిపూట స్నానం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి.
 

Latest Videos


 రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే సులభంగా ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువ సమయం పాటు మురికి,దుమ్ము చర్మం మీద అలాగే ఉంటే అది చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి రాత్రిపూట స్నానం చేయడం  ఆరోగ్యానికి మంచిది.
 

 అలాగే వేసవిలో దుమ్ము వల్ల ఎండ వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. దీనికి తేమ చాలా అవసరం.  అందుకే స్నానం వల్ల శరీరం మురికి వదిలి శుభ్రపడుతుంది. అంతేకాకుండా శరీరము మనసు కూడా తేలికగా ఉన్న భావన కలుగుతుంది.
 

 అయితే రాత్రి స్నానం చేయడం వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట చన్నీటి స్నానం చేయకపోవడమే మంచిది.  కాస్త గోరువెచ్చని వీటిని స్నానానికి ఉపయోగించడం మంచిది. అలాగే మరీ ఆలస్యంగా స్నానం చేయవద్దు నిద్ర పట్టేందుకు సమయం పడుతుంది.

నిద్ర ఆలస్యం అయితే పొద్దున్న నిద్రలేచేందుకు ఇబ్బంది అవుతుంది. అలాగే స్నానం చేయాలనుకుంటే స్నానం చేసిన తరువాతే భోజనం చేయడం మంచిది. భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం అసలు మంచిది కాదు. అలాగే ఆరోగ్యం సరిగా లేనివారు రాత్రిపూట స్నానం చేయకుండా ఉండడం మంచిది.

click me!