Fridge Organizers: ఫ్రిడ్జ్ అంటే మినీ స్టోర్ రూం. ఉప్పులు నుంచి పప్పులు వరకూ అన్నీ దాంట్లోనే ఉంటాయి. వెతికినప్పుడు ఏవీ కనిపించవు. అందుకే రూ.100 లోపు దొరికే ఈ ఫ్రిడ్జ్ బాక్సులు తీసుకుని ఆర్గనైజ్ చేసుకుంటే అవసరానికి దొరుకుతాయి. నీట్‍గా కనిపిస్తుంది.
ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు సర్దినా..మళ్లీ చిందరవందరగా అయిపోతాయి. వంటచేస్తున్నప్పుడో, ఏదైనా కావాలన్నప్పుడో వెతికితే ఏవీ కనిపించవు. మళ్లీ అన్నీ తీయాలి. తర్వాత సర్దుకోవాలంటే విసుగుపుట్టి ఎక్కడివక్కడే పెట్టేస్తారు. ఇంకోసారి తీసినప్పుడు అదే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ బాక్సులు తీసుకుంటే…ట్రాన్స్ పరెంట్‍గా ఉండి చేయి పెట్టగానే దొరికేస్తాయి. ఈ బాక్సులు కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. జస్ట్ రూ.100 చాలు. చాలా స్మార్ట్, ఉపయోగకరమైన ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు దొరుకుతున్నాయి. ఇవి మీ ఫ్రిడ్జ్‌ను నీట్‌గా ఉంచడమే కాకుండా, పండ్లు, కూరగాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతాయి కూడా.
25
ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్
రూ.100 లోపే కిచెన్ స్టోరేజ్ కంటైనర్లు సులభంగా దొరుకుతాయి. ఇలాంటి 6 పీసుల కంటైనర్ సెట్ మీ ఫ్రిడ్జ్‌ను, కిచెన్‌ను శుభ్రంగా, నీట్‌గా ఉంచడంలో సహాయం చేస్తుంది. వీటిలో కోసిన కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లేదా చిన్న చిన్న ఫుడ్ ఐటెమ్స్ నిల్వ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ డిజైన్ కావడం వల్ల, లోపల పెట్టినవి త్వరగా పాడవవు. ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయి.
35
స్లైడర్ ఫ్రిడ్జ్ కంటైనర్
తక్కువ స్థలంలో ఎక్కువ సామాన్లు పెట్టడానికి స్లైడర్ ఫ్రిడ్జ్ కంటైనర్లు ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ కంటైనర్లను ఫ్రిడ్జ్‌లోని గాజు షెల్ఫ్ కింద క్లిప్ సహాయంతో సులభంగా అమర్చుకోవచ్చు. అవసరమైనప్పుడు వాటిని బయటకు జరుపుకోవచ్చు. దాదాపు ₹99 ధరలో దొరికే ఈ కంటైనర్లు ఫ్రిడ్జ్‌కు బెస్ట్ ఆప్షన్.
ట్రాన్స్‌పరెంట్ ఫ్రిడ్జ్ కంటైనర్ల ప్రత్యేకత ఏంటంటే, వీటిలో పెట్టిన వస్తువులు బయటకు స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల పదేపదే బాక్సు మూత తెరవాల్సిన పని ఉండదు. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లు. వీటిలో పండ్లు, కూరగాయలు, కట్ చేసిన పండ్లు లేదా స్నాక్స్ ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో మీకు 6 అరలు ఉన్న బాక్స్ దాదాపు ₹77కే దొరకవచ్చు.
55
వర్టికల్ కిచెన్ కంటైనర్
మీ కిచెన్ లేదా ఫ్రిడ్జ్ సైడ్ ఏరియాలో తక్కువ స్థలం ఉంటే, వర్టికల్ కిచెన్ కంటైనర్లు మంచి ఆప్షన్. వీటిలో చిన్న చిన్న ట్రాన్స్‌పరెంట్ బాక్సులు ఉంటాయి. సురక్షితమైనవి కూడా. వాటిపై మూత టైట్‌గా ఉంటుంది, దీనివల్ల ఫ్రూట్స్, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఈ బాక్సులు కూడా అంత ఈజీగా పగిలేవి కాదు. ఈ రోజుల్లో స్లైడర్, ట్రాన్స్‌పరెంట్ ఫ్రిడ్జ్ కంటైనర్లను చాలామంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు.