Chanakya Niti: సాధారణంగా చాలామంది అబ్బాయిలు, అమ్మాయిల అందం చూసి ఇష్టపడతారు. వాళ్ల గుణం కూడా నచ్చితే జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అనుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదట. చాణక్యుడి ప్రకారం అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా అమ్మాయిల మనసు గెలుచుకోవడానికి అబ్బాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అమ్మాయిలు మాత్రం కేవలం అందానికే ప్రాధాన్యం ఇవ్వరట. ముఖ్యంగా అబ్బాయిల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను గమనిస్తారని చాణక్య నీతి చెబుతోంది. మరి అమ్మాయిలను ఆకట్టుకునే ఆ లక్షణాలు ఏంటి? ఎలాంటి అబ్బాయిలను వారు ఇష్టపడతారో ఇక్కడ తెలుసుకుందాం.
24
మర్యాదగా నడుచుకునే అబ్బాయిలు
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. అమ్మాయిలు కేవలం అబ్బాయిల అందం, రూపం చూసి మాత్రమే ఆకర్షితులు కారు. తమకు గౌరవం ఇచ్చే, తమ భావాలను అర్థం చేసుకునే అబ్బాయిలను వారు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా నిజాయతీగా ఉండటం, మాటల్లోనూ, చేతల్లోనూ నమ్మకంగా వ్యవహరించడం వారికి ఎంతో ముఖ్యం.
తమ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, ఇతరుల ముందు తమను చిన్నచూపు చూడకుండా గౌరవించే అబ్బాయిలంటే అమ్మాయిలకు ప్రత్యేకమైన అభిమానం. ఇలాంటి గుణాలు ఉన్న అబ్బాయిలతో జీవితాంతం సంతోషంగా, ప్రశాంతంగా ఉండవచ్చని అమ్మాయిలు నమ్ముతారు. అందుకే ఈ లక్షణాలు కలిగిన అబ్బాయిలు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అమ్మాయిల దృష్టిని ఆకర్షిస్తారు.
34
ముక్కుసూటిగా మాట్లాడే అబ్బాయిలు
ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని చాణక్య నీతి చెబుతోంది. ముఖ్యంగా ఎదుటివారిని మెప్పించడానికి అబద్ధాలు చెప్పకుండా, తమ మనసులో ఉన్న విషయాన్ని నిజాయతీగా చెప్పే వ్యక్తిత్వం అమ్మాయిలకు నచ్చుతుందట.
అయితే ముక్కుసూటితనం పేరుతో కఠినంగా లేదా బాధించేలా మాట్లాడకుండా, తమతో సున్నితంగా వ్యవహరిస్తూనే ఏ విషయం అయినా నిజాయతీగా చెప్పే అబ్బాయిలతో అమ్మాయిలు త్వరగా కనెక్ట్ అవుతారట. అలాంటి వ్యక్తులపై నమ్మకం ఏర్పడటమే కాకుండా, తమ జీవితంలో ఏ విషయాన్నైనా స్వేచ్ఛగా పంచుకోవచ్చనే భావన కలుగుతుందట. అందుకే నిజాయతీ, స్పష్టమైన మాట, ఎదుటివారి భావాలను గౌరవించే తత్వం ఉన్న అబ్బాయిల పట్ల అమ్మాయిలు ప్రత్యేకమైన ఆసక్తి చూపుతారని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి.
చాణక్యుడి ప్రకారం కోపాన్ని కంట్రోల్ చేసుకునే అబ్బాయిలను, అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. అతిగా కోప్పడటం, ప్రతి చిన్నదానికి తీవ్రంగా రియాక్ట్ అవ్వడం అమ్మాయిలకు నచ్చదట. ఎలాంటి కష్టమొచ్చినా ఓర్పుగా సమస్యను పరిష్కరించే అబ్బాయిలనే వాళ్లు ఇష్టపడతారట. అమ్మాయిల బాధను చికాకు పడకుండా వినేవాళ్లు, మనసులోని మాటను ముందుగానే అర్థం చేసుకునే అబ్బాయిలకు అమ్మాయిలు త్వరగా అట్రాక్ట్ అవుతారని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి.