AC Rain Cover: మీ AC పాడవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న వస్తువును ట్రై చేయండి.. ధర కూడా తక్కువే!

Published : Sep 09, 2026, 02:38 PM IST

AC Rain Cover: వర్షాకాలంలో ఏసీ అవుట్ డోర్ యూనిట్ లో చాలా సమస్యలు వస్తుంటాయి. వర్షం నీళ్లు, తేమ, దుమ్ము దూళి చేరి అవుట్ డోర్ యూనిట్ తుప్పు పట్టడం, పనితీరు తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అయితే చాలా తక్కువ ఖర్చుతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలాగో చూద్దాం.

PREV
14
AC అవుట్ డోర్ యూనిట్ రెయిన్ కవర్

వర్షాకాలంలో ఏసీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయట ఉండే ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పై వర్షం, తేమ, దుమ్ము ఎక్కువగా పడుతుంటాయి. దీని వల్ల కాలక్రమేణా యూనిట్‌కు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గ్యాస్ లీక్‌లు కూడా ఏర్పడి, ఏసీ పనితీరు తగ్గిపోవచ్చు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి తక్కువ ధరలో లభించే రెయిన్ కవర్ బెస్ట్ ఆప్షన్. ఈ రెయిన్ కవర్ ధర ఆన్ లైన్లో రూ. 300 నుంచి రూ. 800 వరకు ఉంది. మరి ఈ రెయిన్ కవర్ ఏసీ అవుట్ డోర్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

24
తుప్పు నుంచి రక్షణ

వర్షపు నీరు నేరుగా అవుట్‌డోర్ యూనిట్‌పై పడకుండా రెయిన్ కవర్ అడ్డుకుంటుంది. దీంతో యూనిట్‌పై తేమ ఎక్కువసేపు ఉండే అవకాశం తగ్గుతుంది. రెయిన్ కవర్ లేకుంటే ఏసీ అవుట్ డోర్ యూనిట్ లో తేమ ఎక్కువకాలం ఉంటుంది. దానివల్ల లోహ భాగాలకు తుప్పు పట్టే అవకాశం పెరుగుతుంది. రెయిన్ కవర్ ఉండటం వల్ల వర్షపు నీటి ప్రభావాన్ని తగ్గి తుప్పు పట్టే సమస్య తగ్గుతుంది.

అయితే రెయిన్ కవర్ సెట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు కాయిల్స్, ఫిన్స్‌పై పేరుకున్న దుమ్మును శుభ్రం చేయాలి. అలాగే యూనిట్ చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అవుట్‌డోర్ యూనిట్‌కు తుప్పు పట్టి భాగాలు దెబ్బతింటే, రిపేర్ కోసం వేల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఖర్చుతో పోలిస్తే తక్కువ ధరలో వచ్చే ఈ కవర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

34
గ్యాస్ లీక్ తగ్గించడంలో..

ఏసీలోని రాగి కాయిల్స్, కనెక్షన్లు, ఇతర లోహ భాగాలపై తుప్పు ఏర్పడితే, కాలక్రమేణా చిన్న లీక్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఏసీలోని రిఫ్రిజెరెంట్ గ్యాస్ నెమ్మదిగా తగ్గవచ్చు. గ్యాస్ తగ్గితే ఏసీ సరిగ్గా పనిచేయకపోవచ్చు. దాంతో మళ్లీ గ్యాస్ నింపించాల్సి రావచ్చు. దీని కోసం కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ రెయిన్ కవర్ ఉంటే వర్షపు నీరు నేరుగా యూనిట్‌పై పడకుండా చేయడం వల్ల తేమ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.

44
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అవుట్‌డోర్ యూనిట్‌పై మంచి నాణ్యత ఉన్న రెయిన్ కవర్ ఉపయోగించాలి. కవర్ పూర్తిగా గాలి ప్రవాహాన్ని అడ్డుకోకుండా చూసుకోవాలి. కాయిల్స్, ఫిన్స్‌పై పేరుకున్న దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గ్యాస్ లీక్ అనుమానం ఉంటే కచ్చితంగా టెక్నీషియన్‌ను సంప్రదించాలి. రెయిన్ కవర్ ఉన్నా, ఏసీకి సర్వీసింగ్ అవసరమైతే ఆ పనిని వాయిదా వేయకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories