బాదం పప్పు తినడం కోసమే కాదు.. అదృష్టం కోసం కూడా ఉపయోగించవచ్చు. రోజూ వాడే కొన్ని వస్తువులు అదృష్టాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అల్యూమినియం ఫాయిల్‌లో బాదం చుట్టి పర్సులో పెట్టుకోవడం అలాంటిదే.
బాదం పప్పులు కేవలం తినడానికే కాదు.. వాటితో కొన్ని రెమెడీస్ కూడా పాటించవచ్చు. మన చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి వాస్తు, ఫెంగ్ షుయ్‌లో చాలా పరిహారాలున్నాయి. సోషల్ మీడియాలో, ఫెంగ్ షుయ్ పద్ధతుల్లో 'అల్యూమినియం ఫాయిల్‌లో బాదం చుట్టడం' ఒక పాపులర్ లక్కీ చార్మ్‌గా మారింది.
ఫెంగ్ షుయ్ నమ్మకం ప్రకారం ఇలా చేయడం వల్ల.. సంపద, కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. రోజువారీ సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసిక శక్తి లభిస్తుంది. కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఇది శుభాన్నిస్తుందని నమ్ముతారు.
23
అల్యూమినియం ఫాయిల్ ఎందుకు వాడాలి?
ఫెంగ్ షుయ్ ప్రకారం, అల్యూమినియం ఫాయిల్ ఒక 'రక్షణ కవచం' (Energy shield) లాగా పనిచేస్తుంది. బాదంలోని పాజిటివ్ ఎనర్జీ బయటకు పోకుండా, నెగటివ్ ఎనర్జీ దానిపై పడకుండా ఇది కాపాడుతుందని నమ్మకం.
ఫెంగ్ షుయ్‌లో బాదంను బలానికి, కొత్తదనానికి చిహ్నంగా చూస్తారు. ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా పెరిగే శక్తికి ఇది సంకేతం. దీని ఆకారం, పోషకాలు.. సంపదను, వనరులను కాపాడటానికి ప్రతీకలుగా భావిస్తారు.
33
దీన్ని ఎలా ఉపయోగించాలి?
ఒక చిన్న అల్యూమినియం ఫాయిల్ తీసుకుని, అందులో ఒక మంచి బాదం పప్పును పూర్తిగా చుట్టండి. దీన్ని మీ పర్సు, వాలెట్ లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో వేరే వస్తువులు తగలని చోట పెట్టండి. ముఖ్యంగా కొత్త పని మొదలుపెట్టే మొదటి కొన్ని వారాలు దీన్ని వెంట ఉంచుకోవడం శుభప్రదమని నమ్ముతారు. (గమనిక: ఇది ఫెంగ్ షుయ్, పురాతన నమ్మకాలపై ఆధారపడిన విషయం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాజిటివ్ ఆలోచనల కోసం చాలామంది దీన్ని పాటిస్తారు).