అవుట్ డోర్ ఏసీలలో అగ్నిప్రమాదానినికి అతి పెద్ద కారణం దానిని సరిగా అమర్చకపోవడమే. ఏసీ బయటి భాగాన్ని ఎల్లప్పుడూ గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో ఉంచాలి. ఒకవేళ ఏసీ బయటి భాగం ఇరుకుగా ఉంటే లేదా అవుట్ డోర్ యూనిట్ ని ఇరుకైన ప్రదేశంలో పెడితే, ఏసీ వేడి గాలిని లోపలికి పీల్చుకుంటుంది. అంతేకాకుండా, అవుట్ డోర్ యూనిట్ కి ఎండ తగిలినా కూడా అది పేలే ప్రమాదం ఉంది. కాబట్టి, ఏసీ బయటి భాగాన్ని అమర్చేటప్పుడు.. ఎండ తగలకుండా చూసుకోవాలి.
చాలా కాలం తర్వాత ఏసీ వాడకం..
ఎండాకాలం మొదలవ్వగానే.. అందరూ ఏసీ ని ఆన్ చేస్తారు. వర్షాకాలం, చలికాలంలో మాత్రం ఏసీని వాడకుండా ఉంచుతారు. దీని వల్ల ఏసీ లోపల దుమ్మూ, ధూళి పేరుకుపోతాయి. చాలా కాలంగా ఉపయోగించకపోవడం వల్ల ఏసీ ఫిల్టర్, ఇతర భాగాలపై దుమ్ము పేరుకుపోతుంది. ఎండాకాలం మొదలవ్వగానే ఏసీకి సర్వీసింగ్ చేసి.. ఆ తర్వాత ఉపయోగించాలి. అలా చేయకపోతే.. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. లేదంటే.. ఏసీ కంప్రెసర్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.