కడుపులో గ్యాస్ ఏర్పడటానికి అసలు కారణమిదే.. ఉపశమనం పొందాలంటే ఇలా చేయాల్సిందే..

Published : May 15, 2022, 01:59 PM IST

Stomach Gas Remedies: కొన్ని రకాల ఆహారా పదార్థాలను తిన్నప్పుడు కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.   

PREV
110
కడుపులో గ్యాస్ ఏర్పడటానికి అసలు కారణమిదే.. ఉపశమనం పొందాలంటే ఇలా చేయాల్సిందే..

Stomach Gas Remedies: ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో భాదపడుతున్నారు. కానీ ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేస్తుంటారు. దీంతో కడుపులో అసౌకర్యంగా అనిపించడంతో పాటుగా నొప్పి కూడా పుడుతుంది. ఈ సమస్య వల్ల రోజు వారి పనులను కూడా చేసుకోలేరు. 

210

కడుపులో గ్యాస్ ఏర్పడటం వల్ల ప్రశాంతంగా ఉండలేరు. అంతేకాదు తమ పనులను కూడా సరిగ్గా చేసుకోలేరు. ఇలాంటి పరిస్థితికి రావడానికి అసలు కారణం ఏంటో తెలుసుకుంటే దీని నుంచి ఉపశమనం పొందడం సులభతరం అవుతుంది. 

310

కడుపులో గ్యాస్ ఏర్పడటానికి కారణాలు.. మన దేశంలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే పరిగడుపున టీ తాగే అలవాటు ఉంటుంది. దీనినే బెడ్ టీ అనికూడా పిలుస్తాము. కానీ ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది కడుపులో గ్యాస్ సమస్యను కలిగిస్తుంది కూడా. 

410


బిజీ లైఫ్ స్టైల్ ,  సమయం లేకపోవడం వల్ల చాలా మంది చాలా తర్వతర్వగా తింటుంటారు. దీనివల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు ఇది గ్యాస్ సమస్యగా మారుతుంది. 

510

లాక్టోస్  ఎక్కువగా ఉండే  పాలు లేదా పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఇలాంటి వాటిని  పరిమితిలోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

610

పరిమితికి మించి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కూడా కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తుతుంది. అంతేకాదు అనారోగ్యకరమైన ఆహారాలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. ఏ కారణం చేతైనా తిన్నది అరగకపోతే కూడా కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. 
 

710

గ్యాస్ నుంచి ఉపశమనం పొందాలంటే .. 
సోంపు నీటిని తాగడం వల్ల కడుపులో గ్యాస్ తగ్గడంతో పాటుగా, కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఇందుకోసం టీస్పూన్ సోంపు గింజలను తీసుకుంని గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడకట్టి ఆ నీళ్లను తాగాలి. 

810

స్పైసీ ఫుడ్ ను లేదా ఆయిలీ ఆహారాలను తినడం మానుకోవాలి. అలాగే  ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

910

వేసవిలో పుదీనా నీళ్లను తాగినా.. దాని ఆకులను తిన్నా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. చిన్న కుండలోని కొన్నినీళ్లను పోసి అందులో కాస్త అల్లం  వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ వడగట్టి గోరువెచ్చగా అయ్యాక తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

1010

తిన్న కొద్ది సేపలి తర్వాత కొన్ని నిమిషాల పాటు నడిస్తే కడుపులో ఉండే గ్యాస్ బయటకు వస్తుంది. కాబట్టి తిన్నాక పక్కాగా నడవాలని నిపుణులు చెబుతున్నారు. 

click me!

Recommended Stories