అదే సమయంలో అనుకోకుండా అకాల వర్షంతో పంటలు ధ్వంసమయ్యాయి. తగినంత పంట లభించలేదు. ఇంట్లో తినడానికి బియ్యం లేక, నీళ్లు లేక రవి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటి నిండా బంగారం ఉన్నా తినలేని దుస్థితి ఏర్పడింది. చివరికి... తన అత్యాశే తన మనుగడకు ముప్పు తెచ్చిందని గ్రహించాడు. కానీ అప్పటికే తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
నీతి: మనిషికి జీవితంలో ఆశ ఉండాలి కానీ.. అత్యాశ ఉండకూడదనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.