ఆ తర్వాత అక్కడే ఉన్న కోతిని పిలిచి 'నా దగ్గర దుర్వాసన వస్తుందా?' అని ప్రశ్నిస్తుంది. దీంతో కోతి సింహం మెప్పును పొందాలని ఆలోచించి 'లేదు మహారాజా అలా ఏం రావడం లేదు' అని సమాధానం ఇస్తుంది. దీంతో నాకే అబద్ధం చెప్తావా.? వాసన వస్తున్నా రావడం లేదని నన్ను మోసం చేస్తావా' అని కోతిని కూడా చంపేస్తుంది.
అదే క్రమంలో ఓ నక్క అటుగా వెళ్తుంది. ఆ నక్కును పిలిచిన సింహం నా దగ్గర ఏదైనా వాసన వస్తుందా అని ప్రశ్నిస్తుంది. అయితే ఆ నక్క చాలా తెలివిగా ఆలోచించి.. 'మహారాజా నాకు జలుబు వల్ల సరిగ్గా వాసన తెలియడం లేదు. నేను వాసనను పసిగట్టలేకపోతున్నాను. నన్ను క్షమించండి' అంటుంది. దీంతో ఆ సింహం నక్కను వదిలిపెడుతుంది.
నీతి: చదవడానికి చిన్న కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీతి దాగి ఉంది. సమస్య ఎదురైనప్పుడు ఇలా తెలివిగా స్పందించాలనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మనకు కూడా జీవితంలో ఇలాంటి సమస్యలే వస్తాయి. ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి కష్టాల నుంచి బయటపడాలి. మరీ ముఖ్యంగా అనవసర విషయాల్లో ఇరుక్కొని జీవితాన్ని కష్టంగా మార్చుకోకూడదు.