తులసి కుండీలో మట్టితో కోటీశ్వరులు అవ్వొచ్చు.. ఎలానో తెలుసా?

First Published | Jan 11, 2025, 10:06 AM IST

. తులసి కుండీలోని మట్టి తో… అనేక ప్రయోజనాలు పొందడమే కాదు.. మీరు కోటీశ్వరులు అవ్వొచ్చంటే నమ్ముతారా? దీని గురించి జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం….

మన హిందూ సంప్రదాయంలో, జోతిష్యశాస్త్రంలో తులసి మొక్క కి చాలా ప్రాధాన్యత ఉంది.  ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవాలని.. ప్రతిరోజూ పూజించాలని మన పూర్వీకులు కూడా చెబుతూ ఉంటారు. అలా పూజించడం వల్ల…. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి నెలకొంటాయని నమ్ముతారు.  మరోవైపు తులసి మొక్కకు సంబంధించిన కొన్ని నివారణలు పాటించడం వల్ల.. చాలా ప్రయోజనాలు పొందుతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. తులసి కుండీలోని మట్టి తో… అనేక ప్రయోజనాలు పొందడమే కాదు.. మీరు కోటీశ్వరులు అవ్వొచ్చంటే నమ్ముతారా? దీని గురించి జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం….

Tulsi plant

ఆర్థిక సమస్యలు వస్తే….
మీ ఇంట్లో డబ్బు కొరత ఉన్నా.. అప్పులు, అధిక ఖర్చులు, ఎవరికైనా డబ్బులు ఇచ్చి చిక్కుకుపోయినా.. ఇలాంటి ఏదైనా ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే.. తులసి కుండీలోని మట్టి మిమ్మల్ని రక్షిస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా… మీ ఇంట్లోని తులసి మొక్క నుంచి ఒక పిడికెడు మట్టిని తీసుకొని దానికి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ముడి వేయాలి. ఇప్పుడు దీనిని మీరు  ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరి.. మీ సంపద కూడా పెరుగుతుంది.
 


వైవాహిక సమస్యలు వస్తే…
మీ వివాహ జీవితంలో సమస్యలు ఉంటే. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం క్షీణిస్తున్నట్లయితే, తులసి మొక్క నుండి కొంత మట్టిని రాగి పాత్రలో వేయండి. తరువాత దానికి సింధూరం, పసుపు కలపండి. దీని తరువాత, పాత్రను ఒక గుడ్డతో కప్పి, మీ పడకగదిలో ఎక్కడో సురక్షితంగా ఉంచండి. ఇది మీ వైవాహిక జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది.

కుటుంబంలో శాంతి కోసం…

ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎల్లప్పుడూ వివాదం ఉంటుంది లేదా కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఉండదు. అటువంటి పరిస్థితిలో, తులసి కుండ నుండి మట్టిని తీసుకొని మట్టి దీపంలో నింపి దానిపై కర్పూరం వేసి ప్రతిరోజూ దాని పొగను ఇంట్లో వ్యాపింపజేయండి. ఇది ఇంట్లో కుటుంబ శాంతిని నెలకొల్పుతుంది.
 

కెరీర్ లో  ముందుకు దూసుకుపోవాలంటే…

కెరీర్ ఆగిపోయినా... ఉద్యోగం పొందడంలో ఇబ్బంది ఉన్నా.. మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలని అనుకున్నా కూడాఎక్కడా ఎంపిక కాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా.., వ్యాపారంలో లాభాలు రావాలన్నా… మీరు విద్యా రంగంలో పురోగతి సాధించలేకపోయినా... వీటన్నింటి నుండి బయటపడటానికి, తులసి కుండ మట్టితో తయారు చేసిన గంధపు పేస్ట్‌ను ప్రతిరోజూ మీ నుదిటిపై పూయండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. 

Latest Videos

click me!