మీ పార్టనర్స్ తో ఇలా చేస్తే.. ఇక మీ బంధానికి తిరుగుండదు..

First Published | May 14, 2022, 1:56 PM IST

ఏ బంధంలో అయినా దాన్ని నిలబెట్టుకోవడానికి ఒకరికోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవడం ముఖ్యం. వారం పాటూ బిజీ షెడ్యూల్ తో గడిపి.. వారాంతంలో ఏదో రెస్టారెంటుకో, సినిమాకో వెళ్లి అయిపోయిందనిపిస్తే కాదు. రకారకాల ఇన్నోవేటివ్ ఐడియాలతో మీ బంధాన్ని బలపరుచుకోవాలి. అవేంటో చూడండి. 

కలిసి జిమ్‌ చేయండి..
వారంలో ఒక్కసారైనా కలిసి జిమ్ చేయండి. వ్యాయామాల సమయంలో, మీ శరీరం ఎండార్ఫిన్‌లు, డోపమైన్‌లను విడుదల చేస్తుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ భాగస్వామితో కలిసి పని చేయడం వల్ల ఈ సంతోషకరమైన మానసిక స్థితిలో వారితో బంధం మరింత దృఢమవుతుంది. మీకు జిమ్‌కి వెళ్లడం ఇష్టం లేకుంటే, ఇండోర్ రాక్ క్లైంబింగ్, జుంబా మొదలైనవాటిని ఎంచుకోవచ్చు. ఇద్దరూ శరీరాల్ని వేడిక్కించే, చెమటపట్టించేలా చేయడం ముఖ్యం.. 

Image: Getty Images

బెడ్‌ మీదే దొర్లుతూ ఉండకండి.. 
వారాంతాల్లో మంచం మీద బద్ధకంగా గడపకుండా..ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువ సేపు నిద్రపోవడం.. మెలుకువ వచ్చినా.. బెడ్ మీదే సోషల్ మీడియా చెక్ చేస్తూ గడిపేయడం చేయకుండా.. మీ భాగస్వామితో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కౌగిలించుకుంటూ సమయాన్ని వెచ్చించండి.


లాంగ్ డ్రైవ్‌
కొన్నిసార్లు మీ బాయ్‌ఫ్రెండ్‌తో సమయం గడపడానికి చక్కటి మార్గం లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం. అందుకే ఎక్కడికి వెళ్లాలి అని పెద్దగా నిర్ణయించుకోకుండా కావాల్సిన స్నాక్స్, డ్రింక్స్, ఫుడ్ తీసుకుని స్టార్ట్ అయిపోండి. 

బబుల్ బాత్ 
మీ భాగస్వామితో చాలాసేపు బబుల్ బాత్‌ చేయడం కంటే శృంగారభరితమైనది ఏదైనా ఉంటుందా? గోరు వెచ్చని నీటితో స్నానం,  సువాసన గల కొవ్వొత్తులు, ఎస్సెన్షియల్ ఆయిల్స్ తో బబుల్ బాత్ కు రెడీ అయిపోండి.. చివరగా చిల్డ్ షాంపైన్ బాటిల్‌ను మరిచిపోవద్దు. 

 

ఇష్టమైన భోజనం వండుకోండి
ఇష్టమైన డీప్-క్రస్టెడ్ పిజ్జాలో ఆర్డర్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ అందులో పెద్ద సరదా ఏముంటుంది? ఇద్దరూ కలిసి వంట చేయడం వల్ల మీ బంధం బలపడుతుంది. అందుకే వీకెండ్ లో ఎంచక్కా ట్రై చేయండి. 

హోమ్ DIY
పెయింటింగ్‌ని వేలాడదీయడం.. లేదా IKEA లో కొన్న వస్తువుల్ని అసెంబ్ల్డ్ చేయడం... లాంటి పనులు మీ భాగస్వామితో కలిసి చేయండి. ఇది వారికి సన్నిహితంగా ఉండటానికి గొప్ప మార్గం. 

ఐస్ క్రీమ్ ట్రీట్
మీరిద్దరూ వారాంతంలో కూడా పనిచేయాల్సి వస్తే... మీరు సాయంత్రాలూ ఐస్‌క్రీం డేట్‌ కి వెళ్లడం బాగుంటుంది. మీకు దగ్గర్లో ఉన్న ఐస్ క్రీం పార్లర్ కు వెళ్లి.. విభిన్న రుచులను ప్రయత్నించండి. మీ రోజువారీ పని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి.

పైన పేర్కొన్న ఈ పాయింటర్‌లు కాకుండా, మీ భాగస్వామితో కనెక్ట్ కావడానికి మీరెప్పుడూ ఫోన్ పట్టుకుని తిరగకూడదనే విషయం గుర్తు పెట్టుకోండి. 

Latest Videos

click me!