మగువలు ముప్పైలో ఇలా చేస్తే.. లైఫ్ అంతా బిందాస్...

First Published Feb 5, 2021, 11:17 AM IST

తమ గురించి తాము ఆలోచించుకోవడం.. ఇది మహిళలు అస్సలు చేయని పనుల్లో ఒకటి. ఎంతసేపు ఇల్లు, పిల్లలు, కెరీర్, చదువులు అంటూ మునిగితేలుతారు కానీ తమ గురించి తాము కాస్త కూడా ఆలోచించరు. ఉద్యోగాలు చేస్తున్నా ఆ మనీని వేరే వాటికి ఉపయోగిస్తారు. కానీ మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించరు.

తమ గురించి తాము ఆలోచించుకోవడం.. ఇది మహిళలు అస్సలు చేయని పనుల్లో ఒకటి. ఎంతసేపు ఇల్లు, పిల్లలు, కెరీర్, చదువులు అంటూ మునిగితేలుతారు కానీ తమ గురించి తాము కాస్త కూడా ఆలోచించరు. ఉద్యోగాలు చేస్తున్నా ఆ మనీని వేరే వాటికి ఉపయోగిస్తారు. కానీ మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించరు.
undefined
ముఖ్యంగా మహిళలు ముప్పై యేళ్లు వచ్చిన తరువాత తమ గురించి తాము కాస్త ఆలోచించుకోవాలి. తమ గురించి మొదటి ప్రాధాన్యత ఉండాలి. అప్పటివరకు మీరేం చేశారో పక్కన పెట్టి మీరు చిల్ అవ్వడానికి ట్రై చేయాలి.
undefined
అలాంటి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.. ప్రయాణాలు చేయడం. చేస్తున్న ఉద్యోగం నుంచి కాస్త విరామం తీసుకుని విహారయాత్రలకు వెళ్లండి. పనులన్నీ మరిచిపోయి ఓ వారంపాటు మీ వీలు, వెసులుబాటు బట్టి దేశంలోనో, విదేశాలకో టూర్ వెళ్లండి. దీంతో ప్రపంచాన్ని మీరు చూసే దృక్పథంలో మార్పు వస్తుంది. అదే సమయంలో మనసు, శరీరం ఉల్లాసంగా మారుతుంది.
undefined
చేస్తున్న జాబ్ రొటీన్ కాకుండా ఉండాలన్నా.. కెరీర్ లో ముందుకు ఎదగాలన్నా అప్ డేట్ అవసరం. జాబ్ లో చురుగ్గా ఉండాలంటే మారుతున్న సాంకేతికత గురించి, కొత్త పోకడల గురించి తెలుసుకోవాలి. వీటికోసం ప్రత్యేకంగా కోర్సులు చేయడం, సెమినార్లలు, ప్రొఫెషనల్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషనల్ డిగ్రీలు చేయడం చాలా మంచిది.
undefined
కెరీర్, ఉద్యోగం లాంటి వాటిల్లో పడి మీ అభిరుచులు, ఇష్టాలు మరిచిపోయి ఉంటారు. అలాంటి వాటిని గుర్తు చేసుకోండి. మళ్లీ వాటిమీద దృష్టి పెట్టండి. పియానో వాయించడమో, పాటలు పాడడమో, కథా సృజన చేయడమో ఇలా.. బాస్కెట్ బాల్, టెన్నిస్.. ఇలా మీకు ఇష్టమైన హాబీని మళ్లీ మొదలుపెట్టండి.
undefined
మహిళలకు అందం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ముప్పై యేళ్ల వయసులో మహిళల్లో శారీరక మార్పుల వల్ల చర్మం, జుట్టు సంరక్షణలో తేడాలు వస్తాయి. అందుకే నిగారింపైన చర్మం కోసం, అందమైన జుట్టు కోసం చక్కటి ఉత్పత్తులను వాడడానికి మొగ్గు చూపండి. చర్మ సంరక్షణ, జుట్టు పట్ల శ్రద్ధ వహించండి.
undefined
చాలామంది మహిళలు పని పని పని అంటూ స్నేహితులను మర్చిపోతారు. రిలేషన్స్ కి దూరంగా ఉంటారు. అయితే ముప్పై దాటిన తరువాత ఇది అంత మంచిది కాదు. ఎంత బిజీ షెడ్యూల్ అయినా కాసేపు స్నేహితులతో గడపడానికి కేటాయించండి, కుటుంబం, బంధువులతో గడిపే సమయం మిమ్మల్ని మరింత ఉత్సాహంగా తయారుచేస్తుంది. ఎందుకంటే గడిచిన సమయం తిరిగిరాదు. తెగిన బంధాలు తిరిగి అతకాలంటే సమయం ఉండదు.
undefined
భవిష్యత్తులో మీరు, మీ కుటుంబం ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్లాన్ చేయడానికి ఇదే సరైన సమయం. డబ్బును సరిగా మేనేజ్ చేయడం.. స్టాక్ మార్కెట్లు, హెల్త్ ఇన్స్యూరెన్సులు, జీవిత బీమా, మ్యూచువల్ ఫండ్స్.. ఇవన్నీ చేయడానికి సరైన సమయం ఇదే. మీరు రిటైరయ్యే సమయానికి ఇవి మెచ్యూర్ అయి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి.
undefined
click me!