వయసుతో పాటు లైంగింకాసక్తుల్లోనూ మార్పులు వస్తాయి. మానసిక, శారీరక పరిణతితో పాటు లైంగిక సామర్థ్యం, ఇష్టాలు, కోరికల్లోనూ మార్పులొస్తాయి. ఆ భావోద్వేగాలే మీరేంటో పట్టిస్తుంది. మీరు ఎలాంటి శృంగారానికి ఇష్టపడతారు అనేది చెబుతాయి.
అయితే సమాజంలోని కొన్ని కట్టుబాట్ల వల్ల యుక్తవయస్కులు, పెద్దవారు వీటి గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడరు. సమాజం నుండి వెలివేస్తారన్న భయం కూడా దీనికి కారణమే.. అయితే మీకు ఎలాంటి శృంగారాసక్తి ఉందనేది మీకు తెలియడం ముఖ్యం.. దీన్నే సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు.
ఒక వ్యక్తిని చూసినప్పుడు మనిషిలో కలగే రొమాంటిక్, శృంగార, భావోద్వేగపరమైన ఆకర్షణనే సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు. కొంతమందికి అపోజిట్ సెక్స్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి సేమ్ సెక్స్ ఇష్టం ఉంటుంది.. ఇలాంటి లైంగికాసక్తులు ఏంటో మీకు మీరు తెలుసుకోవడం జీవితంలో ఎంతో ముఖ్యం.

ఈ విభిన్న లైంగికాసక్తులనేవి ఏర్పడడంలో హార్మోన్లు, జీన్స్ పెద్ద పాత్ర పోషిస్తాయని అధ్యయనాల చెబుతున్నాయి. అలాంటి ఆసక్తులు ఏర్పడడానికి గల కారణాలేమిటి.. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి చూద్దాం.
హెటిరో సెక్సువల్ : స్త్రీలు పురుషులకు, పురుషులకు స్త్రీలు ఆకర్షితులవుతారు. అపోజిట్ సెక్స్ కనిపిస్తే వీరిలో కోరికలు పడగలెత్తుతాయి. వారివైపే వీరి ఆలోచనలు, రొమాన్స్, శృంగారం మొగ్గు చూపుతుంది. తమ కోరికలను వీరు నేరుగా తమ అపోజిట్ సెక్స్ వ్యక్తులతో సంభాషించగలుగుతారు.
హోమో సెక్సువల్ : స్వలింగ సంపర్కులు అంటారు. స్త్రీలు స్త్రీలకు.. పురుషులు పురుషులకు ఆకర్షితులవుతారు. వీరికి అపోజిట్ సెక్స్ కనిపించినా పెద్దగా వీరిలో శృంగారపరమైన స్పందనలు కలగవు. ఇలాంటి హోమో సెక్సువల్స్ లో స్త్రీలను లెస్బియన్స్ అని, పురుషుల్ని గే అని పిలుస్తారు.

బై సెక్సువల్ : ద్విలింగ సంపర్కులు. వీరు స్త్రీలు, పురుషులు ఇద్దరితోనూ రొమాన్స్ చేస్తారు. ఇద్దరి పట్లా ఆకర్షితులవుతారు. ఈ బై సెక్సువల్ స్త్రీ, పురుషులు.. వేరే స్త్రీలకు, పురుషులకు ఇద్దరికీ ఆకర్షితులవుతారు.
అసెక్సువల్ : వీరికి శృంగారంలో పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ ఇతరులతో శృంగారపరమైన, భావోద్వేగాలు ఉండాలని కోరుకుంటారు. రొమాంటిక్ గా ఉండడానికే ఇష్టపడతారు కానీ శృంగారంలో మునిగి తేలాలని, సెక్స్ చేయాలని భావించరు.
ట్రాన్స్ జెండర్స్ : స్త్రీ శరీరంలో పురుషుడు.. లేదా పురుషుడి శరీరంలో స్త్రీ. ఇది సింపుల్ గా వీరి గురించి చెప్పాలంటే.. ఎందుకంటే స్త్రీగా పుట్టినా మనసు పురుషుడిదై ఉండడం.. పురుషుడిగా పుట్టి మానసికంగా స్త్రీల ఉండడం వీరి ప్రత్యేకత. వారి జెండర్ ఐడెంటిటీకి వారి లైంగిక అవయవాలు వ్యతిరేకంగా ఉన్నాయని నమ్ముతారు.
ట్రాన్స్ జెండ్ మహిళ పుట్టుకతో పురుషుడిగా జన్మిస్తుంది. పెరిగినాకొద్దీ తనలో హార్మోనల్ చేంజెస్ తను పురుషుడు కాదు అనే స్పృహను కలిగిస్తుంటాయి. దీంతో వారు జెండర్ మార్పిడి చేసుకుంటారు. కచ్చితంగా బైటికి కనిపించేది వారి గుర్తింపు కాదు.

ఈ మధ్య బాగా చర్చల్లోకి వస్తున్న పదం LGBT. లెస్బియన్, గే, ద్విలింగ, లింగమార్పిడి లాంటి వాటి గురించి మాట్లాడేదే LGBT. ఈ పదం వారి లైంగిక ధోరణి లేదా గుర్తింపు కోరుకుంటున్న వ్యక్తుల ఎంపవరింగ్ కోసం ఉపయోగిస్తున్నారు.
వీరు మామూలు వ్యక్తుల్లా ఉండరు. అందుకే సమాజంలో చిన్నచూపుకు గురవుతుంటారు. తమ లైంగికాస్తకితో గౌరవాన్ని పొందడానికి.. తమ ఇష్టంపై సమాజంలో అవగాహన కల్పించడానికి ఇలా గుర్తింపబడుతున్నారు.
మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే.. మన కుటుంబంలో, చుట్టుపక్కల ఇలాంటి వ్యక్తులున్నప్పుడు వారి ఆసక్తుల మీద, ఇష్టాల మీద గౌరవాన్ని పెంచుకోవడానికి ఇది పనికి వస్తుంది.