ఈ మొక్కలుంటే.. మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు

Published : Jan 25, 2025, 05:10 PM IST

కాలమేదైనా దోమల బెడద మాత్రం తప్పదు. కానీ దోమల వల్ల రాత్రిళ్లు నిద్రపట్టకపోవడమే కాకుండా.. మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు కూడా వస్తాయి. అయితే కొన్ని మొక్కలు ఇంట్లోకి దోమలు రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

PREV
16
ఈ మొక్కలుంటే.. మీ ఇంట్లోకి  ఒక్క దోమ కూడా రాదు

ఈ రోజుల్లో చాలా మంది ఇంటి పెరట్లోనే కాదు.. బాల్కనీ, హాల్, కిచెన్ అంటూ ఇంట్లోని ప్రతి రూముల్లో మొక్కల్నిపెంచుతున్నారు. ఇవి ఇంటిని అందంగా మార్చడమే కాకుండా.. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. అయితే చాలా మంది మొక్కల్ని ఇంటి డెకరేషన్ కోసమే ఉపయోగిస్తుంటారు. కానీ ఈ మొక్కల్తో మనం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు తెలుసా? ముఖ్యంగా ఇవి దోమల వల్ల కలిగే వ్యాధులకు మనల్ని దూరంగా ఉంచుతాయి. అవును కొన్ని రకాల మొక్కల్ని పెంచితే మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. అవి ఏం మొక్కలంటే? 
 

26
Basil

తులసి మొక్క

తులసి మొక్క దాదాపుగా అందరి ఇండ్లలో ఉంటుంది. చాలా మంది ఆడవాళ్లు తులసి మొక్కను ప్రతిరోజూ పూజిస్తారు. ఎందుకంటే హిందూ మతంలో ఈ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఎంతో పవిత్రంగా చూస్తారు. నిజానికి ఈ మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. అంతేకాదు  ఈ మొక్క ఇంట్లోకి దోమలు రాకుండా చేయడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ మొక్క అన్ని కాలాల్లో పెరుగుతుంది. దీని వాసనకు ఇంట్లోకి ఈగలు, దోమలు అస్సలు రావు. 
 

36

బంతిపూలు

బంతిపూలను ఇంటి డెకరేషన్ కోసమే కాదు.. పూజలో కూడా బాగా ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్క కూడా ఇంట్లోకి దోమలు రాకుండా చేస్తుంది. ఈ మొక్క నుంచి వచ్చే వాసనకు దోమలు అటువైపు రానేరావు. అందులోనూ బంతిపూలు మీ ఇంటిని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి కూడా. 
 

46

కర్పూరవల్లి

కర్పూర వల్లి మొక్క మీ ఇంట్లో ఉన్నా దోమలు రమ్మన్నా రావు. అవును ఈ మొక్కలు దోమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ఈ మొక్కను చిన్న కుండలో పెంచి కిటికీల మీద పెట్టుకుంటే సరిపోతుంది. వీటికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు.
 

56

రోజ్మేరీ మొక్క

రోజ్మెరీ మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ ఈ మొక్క దోమలనే కాదు.. చిన్న చిన్న కీటకాలను కూడా మీ ఇంట్లోకి రాకుండా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీని నుంచి వచ్చే సువాసన మీ మనస్సును రీఫ్రెష్ చేస్తుంది. రిలాక్స్ చేస్తుంది. మీ మూడ్ బాగుండేలా చేస్తుంది. 
 

66

పుదీనా మొక్క

పుదీనా ఎలాంటి వాతావరణంలోనైనా బతికేస్తుంది. దీని ఆకులను ప్రతికూరలో వేస్తుంటాం. దీని టేస్ట్ అంత బాగుంటుంది మరి. అయితే ఈ మొక్క కూరల్ని టేస్టీగా చేయడమే కాదు.. ఇంట్లోకి దోమలు, ఈగలు, చీమలు రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్క ఎండిపోకుండా.. నీళ్లు పోస్తే ఈజీగా బతికేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories