పొడిజుట్టుకు కొబ్బరిపాలతో నాచురల్ కండీషనర్.. ఇంట్లోనే ఈజీగా..

First Published | Sep 1, 2021, 4:56 PM IST

జుట్టుకు మంచి కండీషనర్ వాడడం వల్ల పొడి జుట్టు నుంచి నివారణ పొందొచ్చు. తలస్నానం చేసిన ప్రతీసారి ఈ కండీషనర్ వాడడం వల్ల జుట్టు మాయిశ్చరైజ్ అవుతుంది. దీంతో హెల్తీగా ఉండి, విరిగిపోకుండా, చిట్లకుండా ఉంటుంది. 

అందమైన జుట్టు మీ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. కానీ పొడి జుట్టు చికాకును కలిగిస్తుంది. అశాంతిగా ఉంటుంది. జుట్టు బిగుసుకుపోయి.. పొడిబారి చిట్టిపోతుంది, చిక్కులు పడుతూ విరిగిపోతుంది. మరి దీన్నుంచి బయటపడేదెలా? అంటే జుట్టుకు కండీషనర్ అప్లై చేయాలి. 

జుట్టుకు మంచి కండీషనర్ వాడడం వల్ల పొడి జుట్టు నుంచి నివారణ పొందొచ్చు. తలస్నానం చేసిన ప్రతీసారి ఈ కండీషనర్ వాడడం వల్ల జుట్టు మాయిశ్చరైజ్ అవుతుంది. దీంతో హెల్తీగా ఉండి, విరిగిపోకుండా, చిట్లకుండా ఉంటుంది. 

Latest Videos


అయితే.. జుట్టు మరీ పొడిగా ఉంటే మార్కెట్లో దొరికే కండీషనర్లు అంతగా పనిచేయవు. మరి దీనికి పరిష్కారం ఏంటీ.. అంటే సహజసిద్ధమైన కండీషనర్లే మంచి ఫలితాలు ఇస్తాయి. 

దీనికోసం ఇంట్లోనే ఈజీగా సహజసిద్దమైన కండీషనర్ ను చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సినవి... 4 టేబుల్ స్పూన్ల కాగబెట్టిన కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ అర్గాన్ ఆయిల్, 5 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, 5 చుక్కల పిప్పరమెంట్ ఎస్సెన్షియల్ ఆయిల్, 5 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు. 

వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి.. దీంట్లో కొబ్బరిపాలు పోసి బాగా కలపాలి. తరువాత వీటిని ఈ మిశ్రమాన్ని గ్లాస్ జార్ లోకి గానీ, స్ప్రే బాటిల్ లోకి కానీ తీసి పెట్టుకోవాలి. 

ఇలా తయారు చేసిన ఈ కండీషనర్ ని గ్లాస్ జార్ లో వేసి.. ప్రిజ్ లో పెడితే.. వారందాకా తాజాగా ఉంటుంది. జుట్టుకు దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే.. దీన్ని తలస్నానం చేసిన ప్రతీసారి తడి జుట్టు మీద స్ప్రే చేసుకోవాలి.

ఈ సహజ సిద్ధమైన కొబ్బరిపాల కండీషనర్ తో  పొడి జుట్టుకు గుడ్ బై చెప్పవచ్చు. కాకపోతే తాజాగా రెడీ చేసుకుని, తగిన జాగ్రత్తలు పాటిస్తుంటే.. పొడిజుట్టు నుంచి శాశ్వతంగా విముక్తి కావచ్చు.

click me!