Jeera Water: జీరా వాటర్ లో ఇది కలిపి తాగితే చాలు..జీవితంలో హాస్పిటల్ కు వెళ్లరు

Published : Jun 25, 2026, 01:15 PM IST

Jeera Water: ఒక్క జీలకర్ర వల్లే శరీరంలో సగం రోగాలను చెక్ పెట్టొచ్చు. అసలు దీన్ని రోజూ పరగడుపున తీసుకుంటే చాలు…బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జీలకర్రలోని బయోయాక్టివ్ కాంపౌండ్స్.. ఫ్యాటీ లివర్ తగ్గిస్తాయి. అసలు జీవితంలో హాస్పిటల్‍కే వెళ్లరు. 

PREV
16
జీలకర్రలోని పోషకాలతో బరువు తగ్గుతారు

రోజూ ఉదయాన్నే పరగడుపున గ్లాసుడు జీరా వాటర్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు జీవితంలో హాస్పిటల్ కు వెళ్లే పనుండదు. చాలా అనారోగ్యాలకు దీనితో చెక్ పెట్టొచ్చు. జీలకర్రలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. జీలకర్రలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్, ఫ్యాటీ లివర్ వ్యాధి ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి. జీలకర్ర నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. 

26
పేగుల పనితీరు మెరుగుపడుతుంది

జీలకర్ర.. జీర్ణ ఎంజైమ్‌ల పనితీరును పెంచుతుందని నిరూపితమైంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గించగలదు. పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. హెవీగా తిన్నరోజు గ్లాసు జీరా వాటర్ తాగి చూడండి. వెంటనే తిన్న ఫుడ్ జీర్ణమైపోతుంది. శరీరం తేలిక పడుతుంది. 

36
చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

జీలకర్ర నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయని 'అన్నల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం'లో ప్రచురించిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇది శరీర బరువు, కొవ్వు నిల్వలను, ఫాస్టింగ్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. 

46
కాలేయంలో కొవ్వు కరుగుతుంది

జీలకర్ర నీళ్లు తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. రోజూ 3 నెలల పాటు 3 గ్రాముల జీలకర్ర తీసుకుంటే కొవ్వు తగ్గడంతో పాటు, కొలెస్ట్రాల్ ప్రొఫైల్ మెరుగుపడి, నడుము చుట్టుకొలత కూడా తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే జీరా వాటర్ ను ఇలా కూడా చేసుకోవచ్చు. జీలకర్ర, సోంపు, వాము…కాస్త డ్రై రోస్ట్ చేసి మిక్సీ పెట్టుకోవాలి. ఆ పొడిని రోజూ వేడినీళ్లలో కలిపి తాగితే చాలు…ఇంకే మెడిసిన్ అవసరం లేదు. అంతలా పనిచేస్తుంది. కాలేయంలో కొవ్వు కరిగిపోతుంది. 

56
ఆకలిని తగ్గిస్తుంది
ఇది జీవక్రియను వేగవంతం చేసి ఆకలిని కంట్రోల్ చేస్తుంది. భోజనానికి ముందు తాగితే, ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.
66
మోతాదు మించకూడదు

పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. జీలకర్ర నీళ్లలో క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించి, క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా నివారించడంలో సహాయపడుతుంది. కానీ, మోతాదు మించకూడదు. ఎందుకంటే జీలకర్ర నీటిని ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories