ఉదయం ఈ 5 అలవాట్లు మానుకోకపోతే మీరు జీవితంలో ఫెయిల్ అవ్వడం పక్కా..

Published : Feb 21, 2022, 12:15 PM IST

Morning Habits: మన ఫ్యూచర్ ఎలా ఉండాలో మన అలవాట్లే డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా ఉదయం పూట కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ను వదులుకోకపోతే.. మీరు జీవితంలో వెనకబడే ప్రమాదముంది. 

PREV
16
ఉదయం ఈ 5 అలవాట్లు మానుకోకపోతే మీరు జీవితంలో ఫెయిల్ అవ్వడం పక్కా..

జీవితం ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం పూట కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ చెడు అలవాట్ల మూలంగా మనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ అలవాట్లతో మీరు చేపట్టిన పనులు చేయలేరు. ముఖ్యంగా ఊరికూరికే కోపంతో ఊగిపోతుంటారు. అంతేకాదు మీ పనికి ఆటంకం కలిగిందంటూ ఇతరులను నిందిస్తూ ఉంటారు. ఉదయం పూట ఏయే అలవాట్లను వదిలేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..   

26

ఫోన్ చూడటం: నేడు ప్రతి ఒక్కళ్లూ ఉదయం లేవగానే మొదటగా చేసే పని ఏదైనా ఉందా అంటే ఫోన్ చూడటమే. ఇది చాలా చెడ్డ అలవాటు. లేవగానే ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల కళ్ల ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాదు దీనివల్ల ఆ రోజు మీకు మంచిగా గడవకపోవచ్చు. అందుకే ఉదయం లేచి తర్వాత గ్లాస్ వాటర్ తాగి, చల్లటి నీళ్లతో ముఖాన్నికడగండి. అలాగే బయటకు వెళ్లి లేదా గదిలో కిటీకి దగ్గర కూర్చొని స్వచ్చమైన గాలిని పీల్చండి. మీకోసం మీరు కాసేసు సమయాన్ని వెచ్చించండి. పొద్దు పొద్దున్నే సోషల్ మీడియా జోలికి వెల్లకండి. దీనివల్ల మీ మూడ్ చెడిపోయే ప్రమాదం ఉంది. 
 

36
breakfast_skip

బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం:  ఉదయం పూట చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. ఇది చెడ్డ అలవాటని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట బ్రేక్ చేయకపోవడం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మార్నింగ్ తాజా పండ్లను లేదా గుడ్డు, ఓట్ మీల్స్ లేదా టోస్ట్ తో మీ రోజును ప్రారంభించండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు.  

46
postponed

వాయిదా వేయండి: ఈ అలవాటు మహా చెడ్డది. ఇప్పుడేనా కాసేపు, లేదా రేపంటూ ఒక పనిని వాయిదా వేయడం అస్సలు మంచిది కాదు. ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు దానిని అనుకున్న సమయానికే పూర్తి చేయండి. కానీ ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి అంటూ వాయిదా వేసుకుంటూ వెళితే.. మీరు అనుకున్న పనిని ఎప్పటికీ చేయలేరు. ముఖ్యంగా ఏదైనా అనుకున్నప్పుడే తొందరగా చేయాలి. లేదంటే ఆ పనిపై ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంది. 

56

స్నానాన్ని చేయకపోవడం:  మీ రోజును ప్రారంభించడానికి ముందు ఉదయం స్నానం చేయండి. దీనివల్ల మీరు రీఫ్రెష్ గా కనిపిస్తారు. తాజా అనుభూతి కలుగుతుంది. ఒకరకంగా స్నానం మీకు బూస్ట్ లాంటిదనే చెప్పాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్నానం చేయడం వల్ల మన బాడీ నుంచి మంచి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి పనిలో అలసట రాకుండా చేస్తాయి. 

66
negative thoughts

ప్రతికూల ఆలోచనలు: జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనకు ఒరిగేది ఏదీ ఉండదు. కాబట్టి పాస్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ముఖ్యంగా నెగిటీవ్ గా ఎప్పుడూ ఆలోచించడం అంత మంచిది కాదు. నెగిటీవ్ గా ఆలోచిస్తే ఏ పనులను చేయలేం. ముందుకు అడుగులు వేయలేం. కాబట్టి మీ జీవితం గురించి అంతా పాజిటీవ్ గా ఆలోచించండి. మీకు తెలుసా.. ఉదయం పూట నెగిటీవ్ గా ఆలోచిస్తే ఆ రోజంతా చికాకుగా ఉంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories