పండగ అంటేనే పంచుకోవడం. పండగ రోజున మన వాళ్లందరితో కలిసి సరదాగా, ఆనందంగా గడిపితే అంతకన్నా ఆనందం మరోటి ఉండదు. అయితే, ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మనం ఒకరికొకరం బహుమతులు ఇచ్చుకోవచ్చు. అయితే, చాలా మందికి బహుమతులు ఎలాంటివి ఇవ్వాలో ఐడియా ఉండదు. కొందరు బడ్జెట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే, ఈ కింది బహుమతులు మీకు బడ్జెట్ లో అందుబాటులో ఉండటమే కాకుండా, మీ ఆప్తుల మనసులను సంతోషపెడుతుంది. అంతేకాకుండా, మనం ఇచ్చే బహుమతులు పర్యావరణ సహితంగా ఉంటే, మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఆ బహుమతులు ఏంటో ఓసారి చూద్దాం...