గోవర్ధన పూజ ఎలా చేయాలో తెలుసా?

First Published | Nov 4, 2023, 11:06 AM IST

govardhan puja 2023: సనాతన ధర్మంలో గోవర్ధన పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు గోమాతను, గోవర్ధన పర్వతాలతో పాటుగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఇందుకోసం గోవర్ధన పూజను ఎలా చేయాలో తెలుసా? 
 

Govardhan Puja

govardhan puja 2023: ప్రతి శ్రీకృష్ణుడి భక్తుడికి గోవర్ధన పండుగ ఎంతో ప్రత్యేకమైంది. పవిత్రమైంది. ఈ పండుగ కోసం  శ్రీకృష్ణ భక్తులు ఎంతో  ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఈ పండుగను ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజున ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మరి ఈ ఏడాది ఈ పండుగ ఏ తేదీనా వచ్చింది? ఈ పండుగ ప్రాముఖ్యత, ఎలా పూజ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

గోవర్ధన పూజ ఎంతో పవిత్రమైంది. అందుకే ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని,  గోమాతను పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు భక్తులు ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుడికి రకరకాల నైవేధ్యాలను కూడా సమర్పిస్తారు. 
 


గోవర్ధన్ పూజ సమయం

గోవర్ధన పూజ - నవంబర్ 14 (మంగళవారం)

గోవర్ధన పూజ శుభ ముహూర్తం- మంగళవారం ఉదయం 06:43 నుంచి 08:52

తిథి ప్రారంభం - నవంబర్ 13 న సాయంత్రం 14:56 నుంచి

తిథి ముగింపు - నవంబర్ 14  సాయంత్రం 14:36 వరకు
 

govardhan puja 2023

గోవర్ధన పూజ ప్రాముఖ్యత

ఈ రోజున శ్రీకృష్ణుడిని, గోవర్ధన పర్వతాన్ని, గోమాతను పూజిస్తారు. గోవర్ధన పూజ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ రోజు గోవర్ధన పర్వతాన్ని, శ్రీకృష్ణునికి ఇష్టమైన ఆవులను పూజిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 

హిందూ పురాణాల ప్రకారం.. ఈ రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడి కోపం నుంచి బృందావన ప్రజలను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిలో ఎత్తుతాడు. అప్పటి నుంచి గోవర్ధన పర్వతాన్ని పూజించడంతో పాటుగా శ్రీకృష్ణుడిని ఈ రోజు పూజించడం ప్రారంభించారు. కాగా కన్నయ్యను గోవర్ధనదారి, గిరిధారి అని కూడా పిలుస్తారు.
 

గోవర్ధన పూజా విధి

గోవర్ధన పూజ రోజు భక్తులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానాలు చేయాలి. 
ఆ తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి.
మీ ఇంటి గుడిలో దీపాన్ని వెలిగించాలి. 
ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని తయారుచేసి పూజించాలి.
అలాగే నైవేద్యాలను తయారుచేసి గోవర్ధనదారికి సమర్పించాలి. 
మంత్రాలు పఠిస్తూ గోవర్ధన విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
కన్నయ్యకు దండం పెట్టుకుని గోవర్ధన హారతితో పూజను ముగించాలి.

Latest Videos

click me!