చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా మెరవాలంటే...ఇలా చేయండి...

First Published | Aug 20, 2021, 11:07 AM IST

చర్మంమీది మృతకణాలతో పాటు, చర్మ సంబంధిత కాలుష్య కారకాలను కూడా తొలగిస్తుంది. అందుకే రోజూ ఉదయం, రాత్రి క్లెన్సింగ్ చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా నిగనిగలాడుతూ ఉంటుంది. 

ఆరోగ్యకరమైన చర్మం కోసం అందానికి మెరుగులు దిద్దుతుంది. దీనికోసం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి క్లెన్సింగ్. రోజూ ఉదయం, సాయంత్రం చేసే క్లెన్సింగ్ వల్ల మొహం బాగా శుభ్రపడుతుంది. క్లెన్సర్‌లు మొహం మీది అదనపు నూనె, మేకప్, మురికి, మృత చర్మ కణాలను తొలగిస్తాయి. చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. 

చర్మంమీది మృతకణాలతో పాటు, చర్మ సంబంధిత కాలుష్య కారకాలను కూడా తొలగిస్తుంది. అందుకే రోజూ ఉదయం, రాత్రి క్లెన్సింగ్ చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా నిగనిగలాడుతూ ఉంటుంది. 

నీళ్లు బాగా తాగాలి.. చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా, అందంగా ఉండాలంటే చర్మం హైడ్రైట్ గా ఉండడం ముఖ్యం. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. అవి కూడా చల్లటివి కాకుండా.. గది ఉష్ణోగ్రత వద్ద ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 8 నుండి 12 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల చర్మ ఆరోగ్యానికే కాదు మొత్తం శారీరక ఆరోగ్యానికీ చాలా మంచిది.

Latest Videos

మంచినీరు అందానికే కాదు ఆరోగ్యానికీ మంచిది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలూ దరి చేరకుండా ఉంటాయి. నీళ్లు బాగా తాగడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గిపోతాయి. శరీరంలోని, చర్మం మీది విషపూరిత కారకాలు తొలగిపోతాయి. 

ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. ఎక్స్‌ఫోలియేషన్ చర్మానికి అద్భుతాలు చేస్తుంది. ఇది చర్మం బయటి పొరల నుండి మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, ప్రకాశవంతమైన చర్మ రూపాన్ని మెరుగుపరచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మృత కణాలను తొలగించి, తాజాగా అనిపించడానికి వారానికి రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. దీనికోసం స్క్రబ్ లేదా AHA సీరం ఉపయోగించండి.

సీరం : మంచి సీరం చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, చర్మాన్ని నిగారింపు సంతరించుకోవడానికి.. చర్మం మెరుపుకు సహాయపడుతుంది. అయితే చర్మం అవసరాన్ని బట్టి సీరమ్‌ని వాడాలని గుర్తుంచుకోవాలి. అంతేకాదు ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తరువాతే సీరంను వాడాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మృదువుగా చేస్తుంది. మచ్చలు, మరకలు లేని చర్మం కోసం తేమ, నియాసినామైడ్‌ను కలిగి ఉండే హైలురోనిక్ యాసిడ్ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడం మంచిదని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ సిఫార్సు చేస్తున్నారు.
 
సన్‌స్క్రీన్ : సన్‌స్క్రీన్ ఉపయోగించడం అనేది ఆరోగ్యకరమైన చర్మానికి పాటించే ముఖ్యమైన అంశాలలో ఒకటి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరాణాలైన UVA, UVB కిరణాల వలన కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సాయపడుతుంది. చర్మ సంరక్షణ అనేది రోజువారీ దినచర్యలో భాగం కావాలి. అందుకే మేకప్ వేసుకునే ముందు మంచి సన్‌స్క్రీన్ అప్లై చేయవచ్చు. మనదగ్గర ఎండ ఎక్కువగా ఉన్నందున, ప్రతి 4 నుండి 5 గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ను మళ్లీ అప్లై చేయాలి.

click me!