జుట్టు పెరగడం లేదా..? అయితే ఈ పనిచేయండి..

Published : Sep 06, 2022, 02:11 PM IST

పొడవైన జుట్టు ఉండాలని ప్రతి మహిళా ఆశపడుతుంది. కానీ ఏం చేసినా జుట్టు కొందరిలో అసలే పెరగదు. ఎందుకంటే..  

PREV
16
జుట్టు పెరగడం లేదా..? అయితే ఈ పనిచేయండి..

ప్రతి ఒక్కరూ మందపాటి మృదువైన, పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో పేలవమైన జీవనశైలి, వాతావరణ కాలుష్యం,  దుమ్ము కారణంగా జుట్టు పల్చబడటమే కాకుండా.. జుట్టు చాలా రఫ్ గా మారుతుంది. అంతేకాదు చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా  జుట్టు పెరగడం ఆగిపోతుంది. ఎందుకు జుట్టు పెరగడం ఆగిపోతుంది..? జుట్టు పెరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

26

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్టైలిష్ గా కనిపించడానికే మొగ్గు చూపుతున్నారు. జుట్టు విషయంలో మరీ ఎక్కువ. ఇందుకోసం స్ట్రెయిటెనర్లు, కర్లర్లు,  డ్రైయర్లు వంటి ఎన్నో వస్తువులను ఉపయోగిస్తున్నారు. వీటివల్ల జుట్టు అందంగా కనిపించినా.. ఇది మీ జుట్టును బలహీనపరుస్తుంది. ముఖ్యంగా ఇవి మీ జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. వీటివల్ల జుట్టు ఎక్కువ సేపు వెచ్చగా ఉండటం వల్ల మీ జుట్టు బలహీనంగా మారి మధ్యలోనే పగిలి తెగిపోతుంది. 

36

ఈ గజిబిజీ లైఫ్ లో చాలా మంది జుట్టు సంరక్షణను పట్టించుకోవడం లేదు. దీనివల్ల కూడా జుట్టు మరింత వేగంగా దెబ్బతింటుంంది. జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. అంతేకాదు ఇది జుట్టు పెరుగుదలను కూడా ఆపేస్తుంది. అందుకే వారానికి ఒక సారి అయినా హెయిర్ ఆయిల్, డీప్ కండీషనర్, మాస్క్ వేసుకోండి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

46

పగుళ్ల జుట్టు

వెంట్రుకల కొనలు పగిలితే కూడా.. జుట్టు పెరగడం ఆగిపోతుంది. దీనివల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా, నిస్తేజంగా కనిపిస్తుంది. అందుకే ఇలాంటి జుట్టుతో మీరు ఇబ్బంది పడుతుంటే పగిలిన కొనలను కత్తిరించండి. ఇది మీ జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది. 

56

పోషకాల లోపం

ఖనిజాలు, విటమిన్ల లోపం కారణంగా కూడా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. మన జుట్టుకు ప్రోటీన్, ఇనుము,  బయోటిన్, జింక్ వంటి పోషకాలు చాలా అవసరం. ఇవి మన శరీరంలో లోపిస్తే.. జుట్టు పెరుగడం ఆగిపోతుంది. 

66

ఆరోగ్య సమస్యలు

థైరాయిడ్, పీసీఓడీ, హార్మోన్ల అసమతుల్యత వంటి ఆరోగ్య సమస్యలు జుట్టుపై దారుణమైన ప్రభావాన్ని చూపెడుతాయి. ఈ వ్యాధులతో బాధపడేవారికి జుట్టు ఎక్కువగా పెరగదు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు. 

Read more Photos on
click me!

Recommended Stories