పిల్లలకు చిన్నతనంలో నేర్పించాల్సిన లక్షణం ఇది...!

First Published Sep 6, 2022, 1:39 PM IST

ఎంపతీ అనేది.. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికీ, పంచుకోవడానికి ఉపయోగపడే సామర్థ్యం. ఇది సాధారణంగా పెద్దలలో ఉంటుంది

పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే మంచి లక్షణాలు, అలవాట్లు నేర్పించాలని ఆరాటపడుతూ ఉంటారు. మనం చిన్నతనంలో నేర్పించే అలవాట్లే... పెద్దయ్యాక వారికి మంచి పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటాం. అంతేకాదు... మనం నేర్పించే అలవాట్లు వారి భవిష్యత్తుకు ఉపయోగపడతాయని అనుకుంటాం అయితే... మనం నేర్పించే అలవాట్లలో కచ్చితంగా దయాగుణం(ఎంపతీ) ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
 

ఎంపతీ అనేది.. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికీ, పంచుకోవడానికి ఉపయోగపడే సామర్థ్యం. ఇది సాధారణంగా పెద్దలలో ఉంటుంది. కానీ... చిన్న పిల్లల్లో మాత్రం చాలా తక్కువగా ఉంటుందట. కానీ చిన్న పిల్లలకు ఈ విషయం తొందరగా అర్థం కాదట.
 

మొదటి రెండు సంవత్సరాల వయసు వరకు పిల్లలకు చాలా స్వార్థంగా ఉంటారు. తమ బొమ్మల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అన్నీ తమకే కావాలని అనుకుంటారు. తమ తోటి పిల్లలకు ఇవ్వడానికి కూడా వారి మనసు నిరాకరించదు. తమతోటి పిల్లలు ఏడుస్తున్నా కూడా.. వారు తమ బొమ్మలు, చాక్లెట్స్ లాంటివి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. అందుకే.. మనం ఆ విషయాన్ని చిన్న తనం నుంచే వారికి నేర్పించాలట.
 

పిల్లలకు సానుభూతి, దయాగుణం నేర్పించడం ఎందుకు ముఖ్యం..?

తమ పిల్లలు సానుభూతి చూపితే అది ఇతరులకు మేలు చేస్తుందని తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఇతరుల పట్ల సానుభూతి, దయాగుణం నేర్పించడం వల్ల.. పిల్లల్లో... క్లిష్టమైన ఆలోచన, సమస్య-పరిష్కారం, ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన లాంటివి పెరుగుతాయట. 

మెదడు తనంతట తానుగా ప్రతిదీ చేస్తుందనే ఆలోచనకు సైన్స్ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు.మన మెదడుతో పని లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం.  దగ్గుతో ఉన్న స్నేహితుడికి నీటిని అందించడం, మీరు ప్రవేశించే ముందు ఎలివేటర్ నుండి నిష్క్రమించడానికి వ్యక్తులను అనుమతించడం, మీ ముందు మరొక కారు పార్క్ చేయడానికి వేచి ఉండటం వంటి తల్లిదండ్రుల రోజువారీ జీవితంలో సానుభూతి కలిగించే సాధారణ పనులను కూడా పిల్లలు గమనిస్తారట. మనం చేసే కొన్ని పనులను చూసే పిల్లలు నేర్చుకుంటారట.
 

పిల్లలు.. ఆరు నెలల వయసు నుంచే చుట్టూ జరిగే విషయాలను పరిశీలిస్తూ ఉంటారట. ఇక అప్పటి నుంచి పిల్లలు.. ప్రతి నిమిషం తమ పేరెంట్స్ ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనిస్తూనే ఉంటుందట. మనం ఇంటికి వచ్చిన వ్యక్తిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నామనే విషయం దగ్గర నుంచి... ఎలా మాట్లాడుతున్నామనే ప్రతిదీ వారిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి.. మనం పిల్లలకు ఏదైనా నేర్పించాలి అంటే... మనం దానిని ఆచరిస్తే సరిపోతుందట. పిల్లల వ్యక్తిత్వం.. తమ తల్లిదండ్రుల దగ్గర నుంచే ఎక్కువగా నేర్చుకుంటారట.


ఇక ఎంపతీ అనేది ఒక మంచి లక్షణం. ఇతరులపై జాలి, దయ కలిగి ఉండటం.. వారి అభిప్రాయాలను గౌరవించడం లాంటివన్నీ దీని ద్వారా తెలుస్తాయి. పిల్లలు స్వతహాగా నేర్చుకుంటారు అని వదిలేయకుండా.. ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం కొన్ని కొన్ని పనుల ద్వారా పిల్లలకు స్వయంగా వివరించాలట. ప్రస్తుత కాలంలో వారికి అది చాలా అవసరమట. ఆలోచనల్లో సమతుల్యత ఉండటం వల్ల.. పిల్లలు జీవితంలో చాలా వరకు అన్ని సాధించగలరట. ఈ విషయం చాలా పరిశోధనల్లో కూడా తేలింది. అందుకే పిల్లలకు ఎంపతీ, కుటుంబ సంబంధాలు తదితర విషయాలను మనం స్వయంగా నేర్పించాలట.

click me!