దానిమ్మ తొక్కతో టీ.. తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

First Published Dec 13, 2022, 4:55 PM IST

దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ తొక్కలతో టీ తయారుచేసుకుని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. 
 

మనం పనికి రావు అనుకుని పారేసే కొన్ని పండ్ల తొక్కల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయల్లో మనం తినే భాగం కంటే వాటి తొక్కల్లోనే ఎన్నో పోషక విలువలుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అలాంటి వాటిలో దానిమ్మ ఒకటి. దానిమ్మ పండును తింటే శరీరంలో రక్తం పెరగడం నుంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలుసు. అయితే సాధారణంగా దానిమ్మ గింజలను తిని తొక్కలను డస్ట్ బిన్ లో వేసేస్తుంటాం. కానీ ఈ తొక్కల్లో కూడా ఎనలేని ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవును ఈ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్కలతో టీ తయారుచేసుకుని తాగితే కూడా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఇంతకు ముందు చెప్పినట్టుగా దానిమ్మ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఈ టీ గొంతు నొప్పి, దగ్గు, సాధారణ జలుబును తగ్గించడానికి సహాయపడతుంది. మనలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 
 

నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది

దానిమ్మలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరలోని విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.  అలాగే కణాలు మరింత దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడుతుంది కూడా. శరీరం సరైన నిర్విషీకరణ రక్తాన్ని శుద్ధి చేయడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
 

gut health

గట్  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

దానిమ్మ తొక్కలల్లో టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. దానిమ్మలో ఉండే లక్షణాలు మీ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరింత సహాయపడతాయి.
 

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

దానిమ్మ తొక్కల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ చర్మ ఆరోగ్యాన్నిపెంచడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే దాని పిహెచ్ సమతుల్యతను పునరుద్ధరించడానికి కూడా తోడ్పడుతుంది. 
 

dental health

దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది

దానిమ్మ తొక్కలు యాంటికరీస్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి పూత, దంత క్షయం, దంత ఫలకం, వంటి అనేక దంత సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.  
 

దానిమ్మ తొక్కతో టీ ఎలా తయారు చేయాలి

ముందుగా దానిమ్మ తొక్కలను తీసుకొని వాటిని బాగా ఎండబెట్టండి. ఈ తొక్కలను సూర్యరశ్మిలో ఎండబెట్టొచ్చు. లేదా  మైక్రోవేవ్ ఓవెన్ లో కూడా కాల్చొచ్చు. బాగా ఎండిన తొక్కలను బ్లెండర్ లో వేసి బాగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత ఒకటి ఖాళీ టీ బ్యాగ్ తీసుకొని.. అందులో ఒక టీస్పూన్ దానిమ్మ తొక్క పొడి వేసి దాన్ని మూయండి. ఆ తర్వాత ఒక కప్పు నీటిని మరిగించి దానిలో టీ బ్యాగ్ ను వేయండి.. అంతే కప్పు ఆరోగ్యకరమైన టీ రెడీ అయినట్టే.. 

click me!