తలనొప్పిని చిటికెలో తగ్గించే టేస్టీ పానీయాలు.. ఇంట్లోనే ఇలా రెడీ...

First Published Feb 15, 2021, 2:56 PM IST

ఒక్కోసారి తలనొప్పి ఎందుకొచ్చింది, ఎలా పోతుందో అర్థం కాదు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. కాసేపు కళ్లు మూసుకుని ప్రశాంతంగా ఉంటాం. అయినా అది మాట వినదు. ఇక చివరకు తప్పక తలనొప్పి మాత్ర, లేదంటే జిడ్డులాంటి బామ్స్ రుద్దుకోవడం మొదలుపెడతాం.

వర్క్ ఫ్రం హోం.. తెలీకుండానే జీవితం మీద ఒత్తిడిని పెంచింది. దీంతో శారీరక, మానసిక సమస్యలు పెరిగిపోయాయి. అన్నింటినుంచి మనోధైర్యంతో బయటపడుతున్నవాళ్లూ లేకపోలేరు. ఇక పనిలో ఒక్కోసారి సడెన్ గా తలనొప్పి స్టార్ట్ అవుతుంది.
undefined
ఒక్కోసారి తలనొప్పి ఎందుకొచ్చింది, ఎలా పోతుందో అర్థం కాదు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. కాసేపు కళ్లు మూసుకుని ప్రశాంతంగా ఉంటాం. అయినా అది మాట వినదు. ఇక చివరకు తప్పక తలనొప్పి మాత్ర, లేదంటే జిడ్డులాంటి బామ్స్ రుద్దుకోవడం మొదలుపెడతాం.
undefined
అయితే తలనొప్పికి ఇలాంటి ఇన్ స్టాంట్ పద్దతి కంటే ఇంట్లోనే సులువుగా తయారుచేసుకునే చక్కటి పానీయాలతో చెక్ పెటొచ్చు. దీనివల్ల తలనొప్పి తగ్గడమే కాదు. శరీరమూ ఉత్సాహంగా తయారవుతుంది.
undefined
1. ఫీవర్ ఫ్యూ టీఫీవర్ ఫ్యూ ను మెడివల్ ఆస్ప్రిన్ అని కూడా పిలుస్తారు. దీనికున్న ఔషధ తత్వాల వల్ల దానికీ పేరు వచ్చింది. మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ నివారణోపాయం మైగ్రేన్ కు చక్కటి తారకమంత్రంలా పనిచేస్తుంది.
undefined
దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. కొన్ని ఫీవర్ ఫ్యూ ఆకులు తీసుకుని వేడి నీళ్లలో వేసి కాసేపు అలాగే పక్కన పెట్టేయాలి. ఆ తరువాత దీనికి పాలు కలుపుకుని తాగొచ్చు. లేదంటే ఈ వేడి నీటిని వడకట్టి కాస్త ఒక స్పూన్ హనీ కలిపి తీసుకోవచ్చు.
undefined
2పుదీనా టీపుదీనా లోని ఘాటైన వాసన, ఔషధ గుణాలు మెదడులో పట్టేసిన నరాలకు రిలీఫ్ నిస్తాయి. దీనివల్ల నొప్పికి కారణమైన కండరాల్లో కదలిక వస్తుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పే కాదు పుదీనా టీ వల్ల కడుపులోని అసౌకర్యం కూడా తగ్గుతుంది. కడుపును హెల్తీగా ఉంచడానికి కూడా ఈ పుదీనా టీ బాగా పనిచేస్తుంది.ఇది కూడా అంతే.. వేడి నీళ్లలో పుదీనా ఆకులు వేసి.. కాసేపు పక్కన పెట్టి ఆ తరువాత వడకట్టి ఒక చెంచా హనీతో తాగేయడమే.

అల్లం ఛాయ్తలనొప్పిని తగ్గించే మరో అద్భుతపానీయం అల్లం టీ. ఇది రక్తనాళాలను ఉత్తేజితం చేసి మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో తలనొప్పి చిటికెలో మాయమవుతుంది.దీన్ని తయారు చేయడం కూడా సులభం.. రెండు కప్పుల నీటిలో, ఒక అంగుళం అల్లం ముక్క చిన్న ముక్కలుగ చేసి వేయాలి. ఈ నీటిని మరిగించి, వడకట్టి స్పూన్ తేనె కలిపి తాగాలి.
undefined
దీనివల్ల తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనంగానే కాకుండా శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మెదడును ఉత్తేజితం చేసే సహజగుణం అల్లంలో ఉంటుంది.
undefined
పిప్పర్ మింట్ టీ..పిప్పర్ మెంట్ గాఢమైన వాసన, దీన్లోని ఔషధ గుణాలు, కండరాల దృఢత్వాన్ని తగ్గించడంలో సాయపడతాయి. నరాలకు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. సడెన్ గా వచ్చే తలనొప్పులకు ఈ టీ ఎంతో చక్కగా పనిచేస్తుంది.అంతేకాదు ఈ పిప్పర్ మింట్ టీ కడుపు ఆరోగ్యాన్ని బాగుచేసి, అసౌకర్యాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
undefined
సడెన్ గా వచ్చే తలనొప్పి తగ్గించే మరో అద్భుతమైన పానీయం నిమ్మరసం. హ్యంగోవర్ లో వచ్చే తలనొప్పిని చిటికెలో మాయం చేస్తుంది. దీంతో పాటు అన్ని రకాల తలనొప్పులనూ ఎంతో అద్భుతంగా తగ్గిస్తుంది.
undefined
దీనికోసం నీటిని మొదట మరిగించాలి. ఈ నీటిలో ఒక పూర్తి నిమ్మకాయ లేదా సగం నిమ్మకాయ ముక్క రసం పిండాలి. దీన్ని కాస్త గోరువెచ్చగానే తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరంలో విషపదార్థాలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలనూ తగ్గిస్తుంది.
undefined
click me!