రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ‘క్రిస్పీ చికెన్ 555’..తింటే టేస్ట్ అదుర్స్..!

First Published | Feb 15, 2021, 12:08 PM IST

దీని పేరు వింటేనే నోరూరిపోతోంది కదా. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. రెస్టారెంట్ స్టైల్లో మనం కూడా దీనిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 

నాన్ వెజ్ ప్రియులందరికీ చికెన్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇక ఈ చికెన్ లో స్టార్టర్స్ అంటే కొన్ని వందల రకాలు ఉన్నాయి. వేటి రుచి వాటిదే. రెస్టారెంట్ లో కేవలం చికెన్ తోనే కొన్ని వందల రకాల డిష్ లు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్నింటిని మనం ఇప్పటికే రుచి చూసి ఉంటాం. కాగా.. వాటిల్లోనే ఈ క్రిస్పీ చికెన్ 555 కూడా ఒకటి.
దీని పేరు వింటేనే నోరూరిపోతోంది కదా. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. రెస్టారెంట్ స్టైల్లో మనం కూడా దీనిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొంచెం అటూ ఇటుగా ఇది కూడా చికెన్ 65 లాగానే ఉంటుంది. మరి దీనిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ క్రిస్పీ చికెన్ 555 తయారు చేయడానికి చికెన్ 65 లాగానే చికెన్ ముక్కలను వేయించుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందుగా.. మనం చికెన్ తీసుకొని దానిని శుభ్రం చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కులగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని నూనెలో ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇది తయారు చేయడం అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఉల్లి ముక్కలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
అయితే.. దీనిని తయారు చేసే సమయంలో ఉపయోగించే కొన్ని స్పైసెస్ మరింత రుచిని అదనంగా అందిస్తాయి. ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు... చిన్నపాటి హోమ్ పార్టీలు చేసుకున్నప్పుడు వీటిని చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని రుచి చూసి మీ అతిథులు సైతం ఆశ్చర్యపోతారు.
కావాల్సిన పదార్థాలు...500 గ్రాముల చికెన్ స్ట్రిప్స్4 పచ్చిమిర్చి1 గుడ్డు1 పెద్ద ఉల్లిపాయ, ముక్కలు2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి2 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి1 స్పూన్ కొత్తిమీర పొడి1 స్పూన్ పసుపు పొడి12 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్ఉప్పు రుచి చూడటానికిఎర్ర కారం పొడి రుచి చూడటానికి12 నిమ్మకాయ (రసం)ఫుడ్ కలర్( ఎరుపు రంగు)
తయారీ విధానం..స్టెప్ వన్.. ముందుగా గుడ్డు, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, ఫుడ్ కలర్ పచ్చిమిరపకాయలు మినహా అన్ని మసాలా దినుసుల మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి కొద్ది సేపు నానపెట్టాలి. దాదాపు అరగంట సేపు దీనిని పక్కన పెట్టేయాలి.
స్టెప్ 2..ఈ సమయంలో కొద్దిగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిముక్కలు, పచ్చి మిరపకాయలు వేయించాలి. అనంతరం వాటిని వేరే గిన్నెలో పెట్టుకోవాలి.
ప్టెప్ 3.. ఇప్పుడు అదే నూనెలో.. నాన పెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయించుకోవాలి.
ఎర్రగా వేగిన తర్వాత వీటిని వేయించిన ఉల్లి ముక్కల్లో కలిపేయాలి. అంతే.. కరకరలాడే.. చికెన్ 555 రెడీ.. దీనిని మళ్లీ పచ్చి ఉల్లి ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Latest Videos

click me!