ఈ కనిపించని క్రిముల దాడి నుంచి మన కుటుంబాన్ని, జీర్ణక్రియ సంబంధిత రోగాల నుంచి కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఈ చిన్న జాగ్రత్తలు తప్పక పాటించండి:
స్పాంజ్ మార్చడం: పాత్రలు తోమే కిచెన్ స్పాంజ్‌ను కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా కొత్తది వాడాలి.
ప్రత్యేక కటింగ్ బోర్డ్స్: పచ్చి మాంసం (చికెన్/మటన్) కోయడానికి ఒక బోర్డు, కూరగాయలు లేదా పండ్ల కోసం మరొక బోర్డును వేర్వేరుగా ఉపయోగించాలి.
మొబైల్ ఫోన్ డిసిన్ఫెక్షన్: మనం రోజంతా పట్టుకునే ఫోన్ స్క్రీన్‌ను క్రమం తప్పకుండా డిసిన్ఫెక్టెంట్ వైప్స్‌తో శుభ్రం చేసుకోవాలి.
టవల్స్ మార్పిడి: కిచెన్ టవల్స్, చేతులు తుడిచే టవల్స్‌ను ప్రతి 2-3 రోజులకు ఒకసారి వేడి నీటిలో ఉతికి ఎండలో ఆరబెట్టాలి.
చేతుల పరిశుభ్రత: బయట నుంచి ఇంటికి రాగానే , వంట ప్రారంభించే ముందు చేతులను సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి.
ఇంటిని క్రిమిరహితంగా ఉంచుకోవడానికి రసాయనాలే కాకుండా సానిటైజింగ్ స్ప్రేలు, డిసిన్ఫెక్టెంట్ వైప్స్, లేదా సహజసిద్ధమైన వెనిగర్, నిమ్మరసం, టీ ట్రీ ఆయిల్ చుక్కలను ఉపయోగించి చాలా సులువుగా పరిశుభ్రంగా మార్చుకోవచ్చు.